News October 28, 2025
వనపర్తి: పేదల కడుపు నింపండి.. రూ.5 భోజనం పెట్టండి

వనపర్తి జిల్లా కేంద్రంలో హైదరాబాద్ తరహాలో రూ.5కే భోజనం అందించే పథకాన్ని అమలు చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. కొత్త బస్టాండ్, గాంధీచౌక్, అంబేడ్కర్ చౌరస్తా, కలెక్టర్ కార్యాలయం వంటి ఆరు ప్రాంతాల్లో భోజన కేంద్రాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. వివిధ పనుల నిమిత్తం పట్టణానికి వచ్చే పేద ప్రజల ఆకలి తీర్చడానికి కలెక్టర్, ప్రజాప్రతినిధులు వెంటనే చొరవ తీసుకోవాలని కోరారు.
Similar News
News October 29, 2025
NRPT: బస్సు ప్రమాదంలో గాయపడిన మహిళ మృతి

నారాయణపేట పట్టణానికి చెందిన అంజమ్మ, ఆదివారం పెబ్బేరు బస్టాండ్‌లో బస్సు రివర్స్ తీసుకుంటున్న క్రమంలో టైర్లు కాళ్లపై నుంచి వెళ్లడంతో తీవ్రంగా గాయపడింది. ఆమెను హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆపరేషన్ చేసి రెండు కాళ్లు తొలగించినా, శరీరం మొత్తం ఇన్ఫెక్షన్ కావడంతో మంగళవారం రాత్రి చికిత్స పొందుతూ మృతి చెందిందని కుటుంబ సభ్యులు తెలిపారు.
News October 29, 2025
నారాయణపేట జిల్లాలో ఓ మోస్తరు వర్షం

నారాయణపేట జిల్లా వ్యాప్తంగా ఆగస్టు నుంచి వరుసగా కురుస్తున్న అధిక వర్షాలు రైతుల ఆశలను నీరుగారుస్తున్నాయి. తుఫాను ప్రభావంతో మంగళవారం అత్యధికంగా కొత్తపల్లి మండల పరిధిలో 24.8 మి.మీ వర్షపాతం నమోదైంది. బుధవారం తెల్లవారుజాము నుంచి జిల్లాలో ఎడతెరిపి లేకుండా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. ఈ అధిక వర్షాల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
News October 29, 2025
సంగారెడ్డి జిల్లా ఏఓగా సత్యనారాయణ నియామకం

సంగారెడ్డి జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్త కార్యాలయ నూతన ఇన్‌ఛార్జ్ అడ్మినిస్ట్రేషన్ అధికారిగా డాక్టర్ సత్యనారాయణ నియమితులయ్యారు. ఈయన సదాశివపేట ప్రభుత్వ ఆసుపత్రిలో డెంటల్ సర్జన్‌గా విధులు నిర్వహిస్తూ తాజాగా బదిలీపై ఇక్కడికి వచ్చారు. అయితే ఇప్పటివరకు ఇక్కడ ఏఓగా పనిచేసిన డాక్టర్ భాగ్యశేఖర్‌ను ఇటీవల బాధ్యతల నుంచి తొలగించారు.


