News October 28, 2025

KMM: వామ్మో.. 5 కోట్ల సంవత్సరాల దారుశిలాజం హా?

image

మధిర రైల్వే స్టేషన్‌ రామాలయం పునర్నిర్మాణ పనుల్లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఆలయ ప్రాంగణంలో లభించిన ఓ పురాతన రాయిని పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి పరిశీలించారు. అది సుమారు 5 కోట్ల సంవత్సరాల వయసు గల దారుశిలాజంగా గుర్తించారు. విస్తృత పరిశోధన కోసం శిలను HYD ల్యాబ్‌కు పంపుతున్నట్లు తెలిపారు. ఇంతటి చరిత్ర కలిగిన రాయి దొరకడంపై ఆలయ కమిటీ ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

Similar News

News October 29, 2025

NRPT: బస్సు ప్రమాదంలో గాయపడిన మహిళ మృతి

image

నారాయణపేట పట్టణానికి చెందిన అంజమ్మ, ఆదివారం పెబ్బేరు బస్టాండ్‌లో బస్సు రివర్స్ తీసుకుంటున్న క్రమంలో టైర్లు కాళ్లపై నుంచి వెళ్లడంతో తీవ్రంగా గాయపడింది. ఆమెను హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆపరేషన్ చేసి రెండు కాళ్లు తొలగించినా, శరీరం మొత్తం ఇన్ఫెక్షన్‌ కావడంతో మంగళవారం రాత్రి చికిత్స పొందుతూ మృతి చెందిందని కుటుంబ సభ్యులు తెలిపారు.

News October 29, 2025

నారాయణపేట జిల్లాలో ఓ మోస్తరు వర్షం

image

నారాయణపేట జిల్లా వ్యాప్తంగా ఆగస్టు నుంచి వరుసగా కురుస్తున్న అధిక వర్షాలు రైతుల ఆశలను నీరుగారుస్తున్నాయి. తుఫాను ప్రభావంతో మంగళవారం అత్యధికంగా కొత్తపల్లి మండల పరిధిలో 24.8 మి.మీ వర్షపాతం నమోదైంది. బుధవారం తెల్లవారుజాము నుంచి జిల్లాలో ఎడతెరిపి లేకుండా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. ఈ అధిక వర్షాల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

News October 29, 2025

సంగారెడ్డి జిల్లా ఏఓగా సత్యనారాయణ నియామకం

image

సంగారెడ్డి జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్త కార్యాలయ నూతన ఇన్‌ఛార్జ్ అడ్మినిస్ట్రేషన్ అధికారిగా డాక్టర్ సత్యనారాయణ నియమితులయ్యారు. ఈయన సదాశివపేట ప్రభుత్వ ఆసుపత్రిలో డెంటల్ సర్జన్‌గా విధులు నిర్వహిస్తూ తాజాగా బదిలీపై ఇక్కడికి వచ్చారు. అయితే ఇప్పటివరకు ఇక్కడ ఏఓగా పనిచేసిన డాక్టర్ భాగ్యశేఖర్‌ను ఇటీవల బాధ్యతల నుంచి తొలగించారు.