News October 28, 2025

అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్ మన అందరి బాధ్యత: కలెక్టర్

image

అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్ సాధనలో భాగంగా టోల్‌ ఫ్రీ నంబర్ 1064 గోడపత్రికను కలెక్టర్ ఛాంబర్‌లో కలెక్టర్ జి.రాజకుమారి, జేసీ కొల్లాబత్తుల కార్తీక్ ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలు ఎక్కడైనా అవినీతి ఘటనలు గమనించినప్పుడు వెంటనే టోల్‌ ఫ్రీ నంబర్ 1064కు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ వ్యవస్థల్లో పారదర్శకత, సమర్థత పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు.

Similar News

News October 29, 2025

వికారాబాద్ జిల్లాలో అక్రమ దందా..!

image

వికారాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఇసుక పక్క దారి పడుతోంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం పొందిన అనుమతులను దుర్వినియోగం చేస్తూ, ఇసుకను అక్రమంగా తరలించి, బయట మార్కెట్‌లో విక్రయిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే నాయకులు ఈ అక్రమ రవాణాను ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలు మాత్రం భారీగా వినిపిస్తున్నాయి. పోలీసులు వాహనాలు ఆపితే చాలు ఒక బడా నాయకుడితో ఫోన్ చేయిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

News October 29, 2025

డౌన్స్‌ సిండ్రోమ్ పిల్లలకు ఈ పరీక్షలు చేయిస్తున్నారా?

image

డౌన్స్‌ సిండ్రోమ్‌ ఉన్న పిల్లలకు క్రమం తప్పకుండా కొన్ని వైద్య పరీక్షలు చేయించాలని వైద్యులు చెబుతున్నారు. ఏడాదికోసారి కంటి పరీక్షలు, 6-12 నెలలకు ఒకసారి చెవి పరీక్షలు చేయించాలి. ప్రతి ఆర్నెల్లకోసారి దంత పరీక్షలు, 3-5 ఏళ్లకోసారి ఛాతీ, మెడ భాగాన్ని ఎక్స్‌రే తీసి పరీక్షిస్తూ ఉండాలి. అమ్మాయిల్లో యుక్త వయసు రాగానే పాప్‌ స్మియర్‌ పరీక్ష, సంవత్సరానికోసారి థైరాయిడ్‌ పరీక్ష చేయిస్తూ ఉండాలని సూచిస్తున్నారు.

News October 29, 2025

49 ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

image

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL) ఘజియాబాద్‌లో 49 ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ, టెక్నీషియన్-C పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. ఇంటర్, ITI, డిప్లొమా అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. షార్ట్ లిస్ట్, రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.590, SC/ST/PWBDలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://bdl-india.in/