News October 28, 2025
HYDలోనూ పెరుగుతున్న లగ్జరీ హౌసెస్!

భారతదేశంలోని విలాసవంతమైన నగరాల్లో లగ్జరీ గృహాల విక్రయాలు వేగంగా పెరుగుతున్నాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పూణే తర్వాత HYD, చెన్నై, కోల్‌కత్తా వంటి 7 ప్రధాన నగరాల్లో 2025 జనవరి నుంచి జూన్ వరకు సుమారు 55,640 లగ్జరీ గృహాలు విక్రయమైనట్లు ప్రాపర్టీ కన్సల్టింగ్ కంపెనీ గుణాంకాలు తెలిపాయి. మౌలిక సదుపాయాలు, జీవన ప్రమాణాలు మెరుగవడం ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు.
Similar News
News October 29, 2025
మన్యం జిల్లా ప్రజలకు జేసి సూచనలు

తుఫాన్ తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తలపై జాయింట్ కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డి జిల్లా ప్రజలకు పలు సూచనలు చేశారు. వేడి నీరుగాని క్లోరినేటెడ్ నీరుగాని తాగాలన్నారు. అధికారిక సమాచారం వచ్చేంతవరకు బయటకు వెళ్లొద్దని, విరిగిన విద్యుత్ స్తంభాలు తెగపడిన వైర్ల వద్దకు వెళ్లొద్దని దెబ్బతిన్న లేదా పడిపోయిన భావనాల వద్దకు వెళ్లొద్దని సూచించారు. కొండవాగులు దాటే ప్రయత్నాలు చేయొద్దని అధికారుల సూచనలు పాటించాలన్నారు.
News October 29, 2025
జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

జిల్లావ్యాప్తంగా మొంథా తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. అవసరమైతే తప్ప బయటికి రావద్దని సూచించారు. విద్యుత్ ప్రమాదాలపై జాగ్రత్తలు తీసుకోవాలని, ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ స్తంభాల వద్దకు వెళ్లవద్దని హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలన్నారు. పాత ఇండ్లలో ఎవరో ఉండకూడదని సూచించారు.
News October 29, 2025
CSIR-IIIMలో ఉద్యోగాలు

CSIR-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్(IIIM)జమ్మూ 4 జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు నవంబర్ 13వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఇంటర్, మాస్టర్ డిగ్రీ( హిందీ / ఇంగ్లిష్) ఉత్తీర్ణులు అర్హులు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://iiim.res.in.


