News October 28, 2025

వనపర్తి: అంతరాలు లేని సమాజం కోసం విద్యార్థులు పోరాడాలి

image

వనపర్తిలో జరిగిన పీడీఎస్‌యూ (PDSU) తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలో ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఖాసీం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కుల, మత, ఆర్థిక అసమానతలు లేని సమాజం కోసం విద్యార్థులు పోరాడాలని పిలుపునిచ్చారు. విద్యను వ్యాపారంగా మారుస్తున్న విధానాలపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. శాస్త్రీయ ఆలోచనలతో సమానత్వ భావనను బలోపేతం చేయాలని విద్యార్థులకు సూచించారు.

Similar News

News October 29, 2025

మన్యం జిల్లా ప్రజలకు జేసి సూచనలు

image

తుఫాన్ తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తలపై జాయింట్ కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డి జిల్లా ప్రజలకు పలు సూచనలు చేశారు. వేడి నీరుగాని క్లోరినేటెడ్ నీరుగాని తాగాలన్నారు. అధికారిక సమాచారం వచ్చేంతవరకు బయటకు వెళ్లొద్దని, విరిగిన విద్యుత్ స్తంభాలు తెగపడిన వైర్ల వద్దకు వెళ్లొద్దని దెబ్బతిన్న లేదా పడిపోయిన భావనాల వద్దకు వెళ్లొద్దని సూచించారు. కొండవాగులు దాటే ప్రయత్నాలు చేయొద్దని అధికారుల సూచనలు పాటించాలన్నారు.

News October 29, 2025

జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

image

జిల్లావ్యాప్తంగా మొంథా తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. అవసరమైతే తప్ప బయటికి రావద్దని సూచించారు. విద్యుత్ ప్రమాదాలపై జాగ్రత్తలు తీసుకోవాలని, ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ స్తంభాల వద్దకు వెళ్లవద్దని హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలన్నారు. పాత ఇండ్లలో ఎవరో ఉండకూడదని సూచించారు.

News October 29, 2025

CSIR-IIIMలో ఉద్యోగాలు

image

CSIR-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్(IIIM)జమ్మూ 4 జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు నవంబర్ 13వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఇంటర్, మాస్టర్ డిగ్రీ( హిందీ / ఇంగ్లిష్‌) ఉత్తీర్ణులు అర్హులు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://iiim.res.in.