News October 28, 2025
HYDలోనూ పెరుగుతున్న లగ్జరీ హౌసెస్!

భారతదేశంలోని విలాసవంతమైన నగరాల్లో లగ్జరీ గృహాల విక్రయాలు వేగంగా పెరుగుతున్నాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పూణే తర్వాత HYD, చెన్నై, కోల్‌కత్తా వంటి 7 ప్రధాన నగరాల్లో 2025 జనవరి నుంచి జూన్ వరకు సుమారు 55,640 లగ్జరీ గృహాలు విక్రయమైనట్లు ప్రాపర్టీ కన్సల్టింగ్ కంపెనీ గుణాంకాలు తెలిపాయి. మౌలిక సదుపాయాలు, జీవన ప్రమాణాలు మెరుగవడం ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు.
Similar News
News October 29, 2025
ఓయూ: నవంబర్‌లో డిగ్రీ పరీక్షలు

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని డిగ్రీ కోర్సుల పరీక్ష తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. BA, B COM, BSC, BBA, BSW, తదితర కోర్సుల మూడు, ఐదోవ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలను నవంబర్ 12 నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పూర్తి వివరాలను ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.inలో చూసుకోవాలని సూచించారు.
News October 29, 2025
CM సాబ్‌తో ఆర్.నారాయణ మూర్తి మాట

యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్‌లో సినీ కార్మికులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. వేదిక మీద సీఎం రేవంత్ రెడ్డిని ఆర్.నారాయణ ఆలింగనం చేసుకున్నారు. సినిమాలో డైలాగ్ చెప్పినట్లు, ఓ పాట పాడినట్లు ఆర్.నారాయణ మూర్తి తన శైలిలో CM రేవంత్‌తో ఏదో మాట్లాడారు.
News October 29, 2025
గంజాయి లేడి డాన్ అంగూర్ భాయ్‌కి హైకోర్టులో చుక్కెదురు

హైదరాబాద్ గంజాయి లేడీ డాన్‌గా పేరుగాంచిన అంగూర్ భాయ్‌కి హైకోర్టులో చుక్కెదురైంది. పీడీ యాక్ట్‌పై ఆమె వేసిన పిటిషన్‌ను హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టివేసింది. ధూల్‌పేట్ నుంచి గంజాయి వ్యాపారం నిర్వహిస్తూ అనేక కేసుల్లో నిందితురాలైన అంగూర్ భాయ్‌పై ప్రభుత్వం అమలు చేసిన పీడీ యాక్ట్‌ను సమర్థిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. తీర్పుపై ఎక్సైజ్ శాఖ అధికారులు సంతోషం వ్యక్తం చేశారు.


