News April 10, 2024

మరో ఏడాదిలో మనుషుల కంటే స్మార్ట్‌గా ఏఐ: మస్క్

image

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించి టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరో ఏడాదిలో లేదా రెండేళ్లలో ఏఐ మానవ మేధస్సును అధిగమిస్తుందన్నారు. అయితే ఏఐకి అబద్ధం చెప్పడం నేర్పించకూడదని ఒకసారి దానికి అది అలవాటు పడితే ఇక ఆపడం చాలా కష్టం అవుతుందని హెచ్చరించారు. ట్రైనింగ్ చిప్స్‌ కొరత, విద్యుత్ డిమాండ్ AIకి సవాల్‌గా మారుతాయనే టాక్ నడుస్తున్న వేళ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Similar News

News November 15, 2024

ఎవరిని నమ్మాలి? ఎక్కడ తినాలి?

image

తెలుగు రాష్ట్రాల్లో హోటళ్లలో భోజనం చేయాలంటేనే భయపడాల్సి వస్తోంది. దాదాపు అన్ని రెస్టారెంట్లలోనూ నాణ్యతా లోపాలు కన్పిస్తున్నాయి. తాజాగా విజయవాడలో ‘కాకినాడ వారి సుబ్బయ్య గారి హోటల్’లో ఓ కస్టమర్‌కు భోజనంలో జెర్రి వచ్చింది. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటల్ సీజ్ చేశారు. రుచి, శుచితో పాటు మర్యాదకు మారుపేరుగా చెప్పుకునే చోటా ఇలా జరిగితే ఇంకెక్కడ తినాలి? అని భోజన ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

News November 15, 2024

మహిళలకు గుడ్‌న్యూస్.. త్వరలో ఖాతాల్లోకి డబ్బులు!

image

TG: బ్యాంకుల నుంచి మహిళా స్వయం సహాయక సంఘాలు తీసుకున్న వడ్డీ లేని రుణాలకు ప్రభుత్వం వడ్డీ డబ్బులు రిలీజ్ చేసింది. ఫిబ్రవరి, మార్చికి సంబంధించి మొత్తం వడ్డీ ₹30.70కోట్లను విడుదల చేసింది. త్వరలో ఈ డబ్బులు మహిళా సంఘాల ఖాతాల్లో జమ కానున్నాయి. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 5,283 సంఘాలకు ₹1.99cr, NZBలో 5,010 గ్రూపులకు ₹1.91cr, ఖమ్మంలో 3,983 సంఘాలకు ₹1.66cr, KNRలో 3,983 గ్రూపులకు ₹1.55cr జమ కానున్నాయి.

News November 15, 2024

కీలక వ్యక్తిని నామినేట్ చేసిన డొనాల్డ్ ట్రంప్

image

US అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన ట్రంప్ తన టీంలోకి కీలక వ్యక్తిని తీసుకోనున్నారు. డెమొక్రటిక్ అధ్యక్ష మాజీ అభ్యర్థి, యాంటీ వ్యాక్సిన్ యాక్టివిస్ట్ రాబర్ట్ కెన్నెడీని నామినేట్ చేశారు. ఆయనకు ఆరోగ్యశాఖను అప్పగించనున్నారు. మరోవైపు, జార్జియాకు చెందిన కాంగ్రెస్‌మెన్ డగ్ కొలిన్స్‌ను వెటరన్స్ ఎఫైర్స్ కోసం నామినేట్ చేశారు. ట్రంప్ ఈసారి తన క్యాబినెట్‌లోకి మస్క్ వంటి ప్రముఖులను తీసుకుంటున్న విషయం తెలిసిందే.