News October 28, 2025

మంచిర్యాల: అంగన్‌వాడీ కేంద్రాలు సాగేదెలా..?

image

మంచిర్యాల జిల్లాలోని పలు అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీలు ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా వాటిని ఉన్నతాధికారులు ఇంతవరకు భర్తీ చేయడం లేదు. ముఖ్యంగా ఖాళీ ఏర్పడిన కేంద్రాల్లో టీచర్లకు బీఎల్ఓ వంటి ఇతర బాధ్యతలు అప్పజెప్పడంతో తమపై అదనపు భారం పడుతుందని టీచర్లు వాపోతున్నారు. అధికారులు ఇప్పటికైనా దీనిపై స్పందించి ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్, ఆయా పోస్టులని వెంటనే భర్తీ చేయాలని నిరుద్యోగ యువత కోరుతున్నారు.

Similar News

News October 29, 2025

సంగారెడ్డి: నవంబర్ 5న నదర్ సమ్మేళనం: జగ్గారెడ్డి

image

సంగారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ అతిథి గృహం వద్ద సదర్ సమ్మేళనం నవంబర్ 5వ తేదీన సాయంత్రం 6 గంటల నుంచి నిర్వహించనున్నట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు. సంగారెడ్డిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో సదర్ సమ్మేళనం పోస్టర్లను బుధవారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రదీప్ కుమార్, శ్రీశైలం యాదవ్ పాల్గొన్నారు.

News October 29, 2025

జూబ్లీహిల్స్ బై పోల్‌లో కాస్ట్ పాలి‘ట్రిక్స్’..!

image

జూబ్లీహిల్స్‌ గెలుపుకోసం కాస్ట్ ఓటింగ్‌పై నేతలు దృష్టి సారించారు. ఇప్పటికే కమ్మ సామాజికవర్గం కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నట్లు ప్రకటించింది. కులాల వారీగా బీసీల ఓట్లు 1.34 లక్షలు, ముస్లిం మైనారిటీలు 1.20 లక్షలు, కమ్మవారి ఓట్లు 22,746, రెడ్డిలు 17,641, లంబాడీలు 11,364, క్రిస్టియన్లు 19,396 మంది, ఎస్సీలు 28,350 మంది ఉన్నట్లు సమాచారం. ఏపీలో వర్కౌట్ అయ్యే కాస్ట్ పాలి‘ట్రిక్స్’ మన దగ్గర అమలవుతుందో చూడాలి.

News October 29, 2025

జూబ్లీహిల్స్: KTR రోడ్ షో తేదీలు ఖరారు

image

జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 31 నుంచి వచ్చే నెల 9వ తేదీ వరకు విస్తృత స్థాయిలో ప్రచారం చేయనున్నారు. OCT 31న షేక్‌పేట్, NOV 1న రహమత్‌నగర్, 2న యూసుఫ్‌గూడ, 3న బోరబండ, 4న సోమాజిగూడ, 5న వెంకట్రావునగర్, 6న ఎర్రగడ్డ డివిజన్‌లలో వరుసగా రోడ్‌షోలు నిర్వహించనున్నారు. 30వ తేదీని నుంచి సీఎం నియోజకవర్గ పర్యటన ఖరారైంది. KCR పర్యటనపై ఇంకా స్పష్టతలేదు.