News October 28, 2025
SRPT: ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి: కలెక్టర్

వర్షాలు కురుస్తున్న నేపద్యంలో ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోవాలని, ఆ దిశగా రైతులకు అవగాహన కల్పించాలని నిర్వాహకులకు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. సోమవారం ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహించే జాజిరెడ్డిగూడెం మండలంలో పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. రైతులకు సరిపడా టార్పాలిన్లను అందించాలని ఆదేశించారు. రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు.
Similar News
News October 29, 2025
అమరావతి కేంద్రంగా కొత్త జిల్లా.?

అమరావతి కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటుపై ప్రభుత్వం ఆలోచనలో ఉంది. సచివాలయం, అసెంబ్లీ, కొత్త భవనాలు, కన్వెన్షన్ కేంద్రాలు సిద్ధమవుతున్న నేపథ్యంలో రాష్ట్రస్థాయి కార్యక్రమాలకు వేదికగా అమరావతి మారుతోంది. శాంతిభద్రతలు, ప్రోటోకాల్ బాధ్యతలు పెరుగుతుండటంతో పల్నాడు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలలోని కొన్ని ప్రాంతాలతో కొత్త జిల్లా ఏర్పాటుపై ప్రతిపాదన రూపుదిద్దుకుంటోంది. ఏ ప్రాంతాలు ఉంటాయో COMMENT చేయండి.
News October 29, 2025
అక్టోబర్, నవంబర్ నెలల్లో సిక్కోలును వణికించిన తుఫాన్లు ఇవే..!

1968 నవంబర్‌లో వచ్చిన భారీ తుఫాన్ ఉద్దానంతో పాటు జిల్లాపై ప్రభావం చూపింది. 1995 నవంబరులో 180 కిమీ వేగంతో వీచిన గాలులు తుఫాన్‌తో పంటలు, చెట్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. 1999 సూపర్ సైక్లోన్ జిల్లాను కుదిపేసింది. 2010 జలసైక్లోన్‌లో లక్షల హెక్టార్లలో పంట దెబ్బతింది. 2012, 2013నీలం, పైలాన్ తుఫాన్లు తీరప్రాంతాల్లో కల్లోలం సృష్టించాయి. 2014, 2018 హుద్ హుద్, తిత్లీ విధ్వంసం నేటికీ జిల్లా ప్రజలు మర్చిపోలేదు.
News October 29, 2025
4,155 మందికి పునరావాసం: కలెక్టర్

మొంథా తుఫాన్ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 37 పునరావాస కేంద్రాల్లో మంగళవారం మధ్యాహ్నం నాటికి 4,155 మంది బాధితులకు భోజన సౌకర్యం కల్పించడం జరిగిందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. మంగళవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో 3,581 ఎకరాల వరి పొలాల్లో వర్షపు నీరు చేరిందని, జిల్లాలో తుఫాను కారణంగా 10 గ్రామాలు ముంపునకు గురి కాగలదని గుర్తించడం జరిగిందని ఆమె వెల్లడించారు.


