News October 28, 2025
పెద్దపల్లి కలెక్టర్‌ను కలిసిన నూతన ఎంపీడీవోలు

గ్రూప్-1 నియామకాలలో భాగంగా పెద్దపల్లి జిల్లాకు కేటాయించిన ముగ్గురు ఎంపీడీవోలు మంగళవారం సమీకృత కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్షను మర్యాదపూర్వకంగా కలిశారు. కరీంనగర్‌కు చెందిన కంకణాల శ్రీజ రెడ్డి (509 ర్యాంకు) మంథని ఎంపీడీవోగా, జగిత్యాలకు చెందిన వేముల సుమలత (609వ ర్యాంకు) అంతర్గాం ఎంపీడీవోగా, కరీంనగర్‌కు చెందిన సాదినేని ప్రియాంక (446వ ర్యాంకు) కమాన్‌పూర్ ఎంపీడీవోగా నియమితులయ్యారు.
Similar News
News October 29, 2025
భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: వికారాబాద్ ఎస్పీ

వికారాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి సూచించారు. వర్షాల కారణంగా ఏర్పడిన వరద పరిస్థితిని సమీక్షించిన ఎస్పీ పోలీసు అధికారులకు వాగులు, చెరువుల వద్ద నిరంతరం నిఘా ఉంచాలని, రాకపోకలకు ఆటంకం కలిగించే రోడ్లు వెంటనే మూసివేయాలని ఆదేశించారు. ప్రజలు పొంగిపొర్లుతున్న వాగులు, కాలువలను దాటే ప్రయత్నం చేయవద్దన్నారు.
News October 29, 2025
తుఫాన్ బాధితులకు ఒక్కొక్కరికి రూ.1000

AP: తుఫాన్ బాధితులకు ప్రభుత్వం ఆర్థిక <<18137630>>సాయం<<>> ప్రకటించింది. పునరావాస కేంద్రాలకు వచ్చిన వారికి ఒక్కొక్కరికి రూ.1000 అందజేయాలని నిర్ణయించింది. కుటుంబంలో ముగ్గురి కంటే ఎక్కువ ఉంటే గరిష్ఠంగా రూ.3000 అందజేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు వెళ్లే ముందు ఈ నగదు ఇవ్వనున్నారు.
News October 29, 2025
వికారాబాద్: నేడు జరగాల్సిన పరీక్ష నవంబర్ 1కి వాయిదా

వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా మొంథా తుఫాను ప్రభావంతో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నేడు జరగాల్సిన ఎస్ఏ-1 పరీక్ష నవంబరు ఒకటికి వాయిదా వేశామని డీఈవో రేణుకాదేవి ప్రకటించారు. పరీక్ష వాయిదా విషయాన్ని విద్యార్థులకు తెలియజేయాలని ఆదేశించారు. పాఠశాలకు సెలవు ప్రకటించడంతో విద్యార్థులు తిరిగి ఇంటికి చేరుకుంటున్నారు.


