News April 10, 2024
ADB: రాగల 5రోజులు వర్షాలు !

ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో రాగల 5 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. మధ్య మహారాష్ట్ర వద్ద కేంద్రీకృతమైన ఆవర్తనం అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతోందని.. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. రెండ్రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి.
Similar News
News July 8, 2025
ADB నుంచి JBSకు నాన్ స్టాప్ BUS

ఆదిలాబాద్ నుంచి జేబీఎస్‌కు ఈనెల 10 నుంచి నాన్ స్టాప్ ఆర్టీసీ బస్ సర్వీస్ ప్రారంభిస్తున్నట్లు డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి తెలిపారు. ఈ సర్వీస్ ఆదిలాబాద్ నుంచి ఉదయం 4.45 గంటలకు బయలుదేరి బైపాస్ మీదుగా ఉదయం 10:15 గంటలకు JBS చేరుకుంటుందన్నారు. సాయంత్రం 05.30కి అక్కడి నుంచి బయలుదేరి సింగిల్ స్టాప్ నిర్మల్ వెళ్లి ADBకు రాత్రి 11.15కి వస్తుందని చెప్పారు.
News July 8, 2025
ADB: దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించాలి: కలెక్టర్ రాజర్షి షా

దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆకాంక్షించారు. వికలాంగుల ఆర్థిక పునరావాసం కోసం ఎంపిక చేసిన దివ్యాంగ లబ్ధిదారులకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తాతో కలిసి ఆయన ఉత్తర్వుల కాపీలను ఇచ్చారు. 15 మంది దివ్యాంగుల ఆర్థిక పునరావాసం కోసం 100% సబ్సిడీతో రూ.7.50 లక్షలు మంజూరైనట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిడబ్ల్యూఓ మిల్కా తదితరులు పాల్గొన్నారు.
News July 7, 2025
ఆదిలాబాద్: కంట్లో కారం చల్లి, బండరాళ్లతో కొట్టి హత్య

లక్ష్మిపూర్ అటవీ ప్రాంతంలో <<16964169>>మహిళ <<>>మృతదేహం ఆదివారం లభ్యమైన విషయం తెలిసిందే. ఇంద్రవెల్లి(M) నర్సాపూర్ వాసి వందన(45), ADB వాసి శంకర్‌ను పెళ్లిచేసుకుంది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఎలాగైనా చంపాలని భావించి ఈనెల 2న లక్ష్మిపూర్ అటవీ ప్రాంతానికి తీసుకుని వెళ్లాడు. కంట్లో కారం చల్లి, తలపై బండరాళ్లతో కొట్టి హత్యచేశాడు. తండ్రిపై అనుమానంతో కూతురు PSలో ఫిర్యాదు చేయగా హత్య చేసినట్లు శంకర్ అంగీకరించాడు.