News October 28, 2025

క్యాబిన్ క్రూ జాహ్నవి గుప్తా ఆత్మహత్య

image

రాజేంద్రనగర్ పరిధిలో ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో క్యాబిన్ క్రూ‌గా పనిచేస్తున్న జాహ్నవి గుప్తా ఆత్మహత్య చేసుకుంది. జమ్మూకు చెందిన జాహ్నవి, ఇటీవల ఇండిగో క్యాప్టెన్, స్నేహితుడితో కలిసి పార్టీకి హాజరై, అనంతరం తన గదిలో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. కొన్ని రోజులుగా ఆమె డిప్రెషన్‌లో ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే, ఆత్మహత్యకు గల కారణాలను మాత్రం తల్లిదండ్రులు పోలీసులకు వెల్లడించడం లేదు.

Similar News

News October 29, 2025

HYD: భారీగా బకాయిలు.. నల్లా కనెక్షన్ కట్!

image

HYD జలమండలికి దాదాపు రూ.1,300 కోట్లకుపైగా బకాయిలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో నగరవాసుల నల్లా ఛార్జీలే రూ.147కోట్లు వసూలు కావాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఈ మేరకు నల్లా బిల్లును పూర్తిగా వసూలు చేసేందుకు నగరంలో చర్యలు షురూ అయ్యాయి. బకాయి ఉన్న వినియోగదారులకు ముందుగా నోటీసులు జారీ చేస్తారు. గడువు ముగిసినా చెల్లించకపోతే వారికి నీటి సరఫరా నిలిపివేసి, వసూలుకు చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం.

News October 29, 2025

ఓయూ: నవంబర్‌లో డిగ్రీ పరీక్షలు

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని డిగ్రీ కోర్సుల పరీక్ష తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. BA, B COM, BSC, BBA, BSW, తదితర కోర్సుల మూడు, ఐదోవ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలను నవంబర్ 12 నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పూర్తి వివరాలను ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.inలో చూసుకోవాలని సూచించారు.

News October 29, 2025

CM సాబ్‌తో ఆర్.నారాయణ మూర్తి మాట

image

యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్‌లో సినీ కార్మికులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. వేదిక మీద సీఎం రేవంత్ రెడ్డిని ఆర్.నారాయణ ఆలింగనం చేసుకున్నారు. సినిమాలో డైలాగ్ చెప్పినట్లు, ఓ పాట పాడినట్లు ఆర్.నారాయణ మూర్తి తన శైలిలో CM రేవంత్‌‌తో ఏదో మాట్లాడారు.