News October 28, 2025

అనకాపల్లి: ‘3,211 మంది పునరావస కేంద్రాలకు తరలింపు’

image

అనకాపల్లి జిల్లాలో 136 గ్రామాలకు చెందిన 3,211 మంది బాధితులను 108 పునరావాస కేంద్రాలకు తరలించినట్లు కలెక్టర్ విజయకృష్ణన్ మంగళవారం సాయంత్రం తెలిపారు. వారికి పునరావాస కేంద్రాల్లో భోజనంతో పాటు అన్ని సదుపాయాలను కలిపిస్తున్నట్లు చెప్పారు. మండలాల్లో తహశీల్దారులు ఎంపీడీవోలు, గ్రామస్థాయి అధికారులు ఈ కేంద్రాల్లో ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు.

Similar News

News October 29, 2025

అనకాపల్లి: ‘నష్టం వివరాలను సేకరించాలి’

image

జిల్లాలో జరిగిన పంట నష్టం, ఆస్తి నష్టం వివరాలను సేకరించి వెంటనే నివేదికలను అందించాలని అధికారులను కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. మంగళవారం రాత్రి మాట్లాడుతూ తుఫాన్ తీరం దాటిందన్నారు. రానున్న రెండు రోజుల పాటు ఈదురు గాలులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే వెంటనే పునరుద్ధరించాలన్నారు. రహదారులు మరమ్మతులకు గురైతే వెంటనే రిపేర్లు చేపట్టాలన్నారు.

News October 29, 2025

పార్వతీపురం జిల్లాలో నలుగురు సచివాలయ ఉద్యోగులు సస్పెండ్

image

సీతానగరం మండలం పెదబోగిలి సచివాలయంలో పనిచేస్తున్న నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ మంగళవారం కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. సైక్లోన్ డ్యూటీలో విధులు సక్రమంగా నిర్వహించకుండా కార్యాలయాన్ని విడిచిపెట్టి ఇళ్లకు వెళ్లిపోయారన్నారు.ఈ మేరకు బి.భాస్కరరావు DA, జి.సుమతి WEA, జి.జానకి AHA, ఆర్.అప్పలనరసమ్మ MSPలను సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.

News October 29, 2025

TU: ఇంటిగ్రేటెడ్ పీజీ పరీక్షల రీ-షెడ్యూల్

image

తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని ఇంటిగ్రేటెడ్ పీజీ (అప్లైడ్ ఎకనామిక్స్, ఫార్మసిటికల్ కెమిస్ట్రీ) 7,9 సెమిస్టర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు పరీక్ష నియంత్రణ అధికారి ఆచార్య సంపత్ కుమార్ మంగళవారం సర్కులర్ జారీ చేశారు. ఈనెల 31 నుంచి ప్రారంభం కావాల్సిన ఇంటిగ్రేటెడ్ పీజీ పరీక్షలు నవంబర్ 6 నుంచి 17 వరకు జరగనున్నట్లు వెల్లడించారు. వివరాలకు విశ్వవిద్యాలయం వెబ్సైట్‌ను సందర్శించాలని ఆయన తెలిపారు.