News October 28, 2025
9PM నుంచి రేపు తెల్లవారుజాము వరకూ భారీ వర్షాలు: CBN

AP: 403 మండలాలపై మొంథా ప్రభావం చూపుతోందని CM CBN తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల వద్ద 3 వేల జనరేటర్లు ఏర్పాటు చేశామన్నారు. 7 జిల్లాల్లో ఆగిపోయిన వాహనదారులకు ఆహారం, తాగునీరు సరఫరా చేయాలని ఆదేశించారు. ఈ రాత్రి 9PM నుంచి రేపు తెల్లవారుజాము వరకూ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఇవాళ రాత్రి 11.30 తర్వాత తుఫాన్ తీరం దాటవచ్చని చెప్పారు.
Similar News
News October 29, 2025
మామిడిలో చెదను ఎలా నివారించాలి?

మామిడిలో OCT నుంచి డిసెంబర్ వరకు చెదల బెడద ఎక్కువ. అందుకే చెట్ల బెరడుపై మట్టి గూళ్లను గమనించిన వెంటనే వాటిని తొలగించాలి. చెట్ల మొదలు, కాండంపైన లీటరు నీటికి క్లోరిఫైరిఫాస్ 20EC 3-5ml కలిపి పిచికారీ చేయాలి. తోటలలో, గట్లపై చెద పుట్టలను తవ్వి లీటరు నీటికి క్లోరిఫైరిఫాస్ 20 EC 10ml కలిపి పోయాలి. వర్షాలు తగ్గిన తర్వాత తప్పకుండా కాండానికి 2-3 అడుగుల ఎత్తు వరకు బోర్డోపేస్ట్/బ్లైటాక్స్‌ని పూతగా పూయాలి.
News October 29, 2025
పిల్లలు అబద్ధాలు చెబుతున్నారా?

పిల్లలు అబద్ధాలు చెప్పడం కామన్. కానీ అన్నిటికీ అబద్ధాలు చెబుతుంటే మాత్రం తల్లిదండ్రులు జాగ్రత్తపడాలంటున్నారు నిపుణులు. చాలావరకు తమను రక్షించుకోవడానికే పిల్లలు అబద్ధాలు చెబుతారు. అసలు వారు ఎందుకు అబద్ధం చెబుతున్నారో తెలుసుకోవాలి. నిజం చెప్పినా ఏంకాదన్న భరోసా వారికి ఇవ్వాలి. అప్పుడే అబద్ధాలు చెప్పకుండా ఉంటారు. తల్లిదండ్రులు తరచుగా అబద్ధాలు చెప్తుంటే పిల్లలూ అదే నేర్చుకుంటారంటున్నారు నిపుణులు.
News October 29, 2025
తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీకి సీఎం గ్రీన్‌సిగ్నల్

TG: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పునరుద్ధరణలో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించాలన్న ఇంజినీర్ల ప్రతిపాదనకు CM రేవంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీని నుంచి సుందిళ్లకు 80TMCల నీటిని గ్రావిటీ ద్వారా తరలించి, అక్కడి నుంచి ఎల్లంపల్లికి ఎత్తిపోసేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. తుమ్మిడిహెట్టి నిర్మాణంతో MHలో ఏర్పడే ముంపుపై అక్కడి ప్రభుత్వంతో మాట్లాడాలని నీటిపారుదల శాఖ సమీక్షలో సూచించారు.


