News October 28, 2025

సుంకేసులకు కొనసాగుతున్న వరద

image

రాజోలి మండలంలోని సుంకేసుల జలాశయానికి వరద కొనసాగుతుంది. కర్ణాటకలో కురుస్తున్న వర్షాలు, వాగులు, వంకల ద్వారా వచ్చిన నీటితో జలాశయం నిండుకుండలా మారింది. మంగళవారం సాయంత్రం జలాశయానికి 56,500 క్యూసెక్కుల వరద వస్తుంది. దీంతో బ్యారేజీ 13 గేట్లు ఒక మీటర్ మేర ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. గేట్ల ద్వారా 52,364 క్యూసెక్కులు, కేసీ కెనాల్‌కు 458 క్యూసెక్కులు, మొత్తం 52,822 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.

Similar News

News October 29, 2025

గాజాపై దాడులు.. 60 మంది మృతి

image

గాజాపై ఇజ్రాయెల్ దాడిలో 60 మంది పాలస్తీనియన్లు మరణించారు. వీరిలో చిన్నారులు, మహిళలే ఎక్కువగా ఉన్నారని సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ తెలిపింది. ఇజ్రాయెల్ ప్రధాని ఆదేశించడంతో సైన్యం 3చోట్ల బాంబుల వర్షం కురిపించింది. కాగా బందీల మృతదేహాల అప్పగింతకు ఉద్రిక్త పరిస్థితులు అడ్డంకిగా ఉన్నట్లు హమాస్ పేర్కొంది. హమాస్ ఇజ్రాయెల్ సైనికుడిని చంపడం వల్లే దాడి జరిగిందని, ఇది శాంతికి విఘాతం కాదని ట్రంప్ వ్యాఖ్యానించారు.

News October 29, 2025

కాకినాడ జిల్లాకు రక్షణ కవచంలా ‘ఆ ముగ్గురు’

image

మొంథా తుఫాను నుంచి కాకినాడ జిల్లాను రక్షించడంలో కలెక్టర్ షామ్మోహన్, ఎస్పీ బిందుమాధవ్, స్పెషల్ ఆఫీసర్ కృష్ణతేజ పోషించారు. తుఫాను ప్రభావం మొదలైనప్పటి నుంచి జిల్లా యంత్రాంగాన్ని వీరు ఉరుకులు పరుగులు పెట్టించారు. అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లారు. ఫలితంగా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా నియంత్రించగలగడంలో ఈ ముగ్గురూ సఫలీకృతలయ్యారు. వీరిపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తున్నాయి.

News October 29, 2025

హైదరాబాద్ వదిలిపెట్టి వెళ్లొద్దు: సీఎం రేవంత్ రెడ్డి

image

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక సందర్భంగా నవంబర్ 9వ తేదీ వరకు మంత్రులంతా హైదరాబాద్‌లోనే ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మంత్రులు తప్పనిసరిగా ఇంటింటికీ తిరిగి పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా ఓట్లు అడగాలని తెలిపారు. ఈ ప్రచారంలో మంత్రులకు సహాయంగా ఉండేందుకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర పార్టీ నాయకులు సమన్వయంతో పనిచేయాలని కూడా CM సూచించారు.