News April 10, 2024

తైక్వాండో అసోసియేషన్ జిల్లా కార్యదర్శిగా వినోద్ నాయక్

image

నిజామాబాద్ జిల్లా తైక్వాండో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా సిరికొండ మండల్ హుస్సేన్ నగర్ గ్రామానికి చెందిన వినోద్ నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హైదరాబాదులోని నాచారంలో నిర్వహించిన రాష్ట్ర సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా వినోద్ నాయక్ ను అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలువురు క్రీడా ప్రతినిధులు అభినందనలు తెలిపినారు.

Similar News

News March 11, 2026

జాకోరలో విద్యుత్ షాక్‌తో రైతు మృతి

image

వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని జాకోరలో విద్యుత్ షాక్‌తో గుట్టమీది గంగాధర్ (36) అనే రైతు మృతి చెందారు. బుధవారం ఉదయం తన వ్యవసాయ పొలం వద్ద కేబుల్ వైర్ సరిచేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై వర్ని ఎస్సై వంశీకృష్ణ మాట్లాడుతూ.. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

News March 11, 2026

MP అర్వింద్ ఆతిథ్యం అద్భుతం: నారా లోకేశ్

image

నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ఆతిథ్యం అద్భుతమని ఏపీ మంత్రి నారా లోకేశ్ ప్రశంసించారు. ఓ సమ్మిట్ కోస ఢిల్లీ వెళ్లిన లోకేశ్‌ను అర్వింద్ తన ఇంటికి ఆహ్వానించారు. “అద్భుతమైన భోజనం, అంతకు మించిన మంచి స్నేహంతో గడిపిన సమయం చిరస్మరణీయం. మీ ఆత్మీయత నిజంగా స్ఫూర్తిదాయకం, మీ అభిమానిగా మారిపోయాను” అంటూ విందులో పాల్గొన్న లోకేశ్ తన సంతోషాన్ని పంచుకున్నారు.

News March 11, 2026

మోపాల్: కాలికి వల చుట్టుకొని వ్యక్తి మృతి

image

మోపాల్ మండలం న్యాల్కల్ గ్రామానికి చెందిన ముజిగా శ్యామ్ (43) మత్స్యకారుడు ప్రమాదవశాత్తు కాలికి వల చుట్టుకుని చెరువులో పడి మృతి చెందినట్లు SI సుస్మిత తెలిపారు. జీవనోపాధి కోసం ఎన్.ఎస్.పి కెనాల్ వద్ద పట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తూ ఆయన కాలికి ఉడెన్ వల చుట్టుకొని కెనాల్ నీటిలో జారి పడటం వల్ల మృతి చెందడన్నారు. మృతుడి కోడలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు SI వివరించారు.