News April 10, 2024
నేటితో ముగియనున్న NEET(UG) రిజిస్ట్రేషన్ గడువు
దేశవ్యాప్తంగా MBBS, BDSకోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET-2024) రిజిస్ట్రేషన్ గడువు నేటితో ముగియనుంది. రాత్రి 11:50 గంటలలోపు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడంతో పాటు ఆన్లైన్ ఫీజు చెల్లించవచ్చని NTA పేర్కొంది. గత నెల 16న రిజిస్ట్రేషన్ గడువు ముగియగా, తాజాగా మరోసారి రిజిస్ట్రేషన్ విండోను ఓపెన్ చేసింది. దరఖాస్తు చేసుకోవడానికి ఇదే చివరి అవకాశం అని తెలిపింది.
Similar News
News November 15, 2024
మహిళలకు గుడ్‌న్యూస్.. త్వరలో ఖాతాల్లోకి డబ్బులు!
TG: బ్యాంకుల నుంచి మహిళా స్వయం సహాయక సంఘాలు తీసుకున్న వడ్డీ లేని రుణాలకు ప్రభుత్వం వడ్డీ డబ్బులు రిలీజ్ చేసింది. ఫిబ్రవరి, మార్చికి సంబంధించి మొత్తం వడ్డీ ₹30.70కోట్లను విడుదల చేసింది. త్వరలో ఈ డబ్బులు మహిళా సంఘాల ఖాతాల్లో జమ కానున్నాయి. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 5,283 సంఘాలకు ₹1.99cr, NZBలో 5,010 గ్రూపులకు ₹1.91cr, ఖమ్మంలో 3,983 సంఘాలకు ₹1.66cr, KNRలో 3,983 గ్రూపులకు ₹1.55cr జమ కానున్నాయి.
News November 15, 2024
కీలక వ్యక్తిని నామినేట్ చేసిన డొనాల్డ్ ట్రంప్
US అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన ట్రంప్ తన టీంలోకి కీలక వ్యక్తిని తీసుకోనున్నారు. డెమొక్రటిక్ అధ్యక్ష మాజీ అభ్యర్థి, యాంటీ వ్యాక్సిన్ యాక్టివిస్ట్ రాబర్ట్ కెన్నెడీని నామినేట్ చేశారు. ఆయనకు ఆరోగ్యశాఖను అప్పగించనున్నారు. మరోవైపు, జార్జియాకు చెందిన కాంగ్రెస్‌మెన్ డగ్ కొలిన్స్‌ను వెటరన్స్ ఎఫైర్స్ కోసం నామినేట్ చేశారు. ట్రంప్ ఈసారి తన క్యాబినెట్లోకి మస్క్ వంటి ప్రముఖులను తీసుకుంటున్న విషయం తెలిసిందే.
News November 15, 2024
నేడు అన్నవరంలో గిరిప్రదక్షిణ వేడుక
AP: కార్తీక పౌర్ణమి సందర్భంగా కాకినాడ(D)లోని అన్నవరం సత్యనారాయణ స్వామి గిరి ప్రదక్షిణ వేడుక ఇవాళ జరగనుంది. లక్షన్నర మంది భక్తులు వస్తారనే అంచనాతో అధికారులు పటిష్ఠ ఏర్పాట్లు చేశారు. ఉ.8 గంటలకు స్వామి, అమ్మవార్ల ఊరేగింపు, మ.2కు కొండ దిగువన సత్యరథం ప్రారంభమవుతుంది. ఇక్కడి నుంచే 9.2KM మేర గిరిప్రదక్షిణ జరగనుంది. భక్తులకు ఆహారం, పండ్లు, తాగునీరు, మజ్జిగ అందించేందుకు స్టాల్స్ సిద్ధం చేశారు.