News October 28, 2025
జగిత్యాల: ‘సీనియర్ సీఆర్పీల సేవలు వినియోగించుకోవాలి’

వరంగల్ మహా సమాఖ్యకు చెందిన సీనియర్ సీఆర్పీల సేవలను వినియోగించుకోవాలని డిీఆర్డీఏ పీడీ రఘువరన్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈరోజు సెర్ప్ ఆధ్వర్యంలో మండల పదాధికారుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సీఈవో ఆదేశాల మేరకు 16 మంది సీనియర్ సీఆర్పీలతో 16 మండలాల్లో, 16 మండల, 12 గ్రామ సమాఖ్యలకు ప్రత్యేక శిక్షణ తరగతులు, అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏపీడీ సునీత, డీపీఎంలు పాల్గొన్నారు.
Similar News
News October 29, 2025
చెన్నూర్‌లో అత్యధిక వర్షపాతం

గడచిన 24 గంటల్లో జిల్లా వ్యాప్తంగా సగటున 10.4 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. చెన్నూర్ మండలంలో 31.2 మి.మీ అత్యధిక వర్షపాతం నమోదైంది. కన్నేపల్లిలో 21.8 మి.మీ, వేమనపల్లిలో 21.4 మి.మీ, కోటపల్లిలో 22.4 మి.మీ వర్షం కురిసింది. మంచిర్యాల (4.4 మి.మీ), మందమర్రి (7.2 మి.మీ) సహా మిగిలిన మండలాల్లో కూడా వర్షం నమోదైంది.
News October 29, 2025
NTR: సెలవులపై క్లారిటీ ఇచ్చిన డీఈవో

ఎన్టీఆర్ జిల్లాలోని విద్యాసంస్థలకు ఈ నెల 31 వరకు సెలవులు ప్రకటించినట్లు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న సందేశం అవాస్తవమని డీఈవో సుబ్బారావు స్పష్టం చేశారు. ప్రధానోపాధ్యాయులు అధికారికంగా విడుదల కాని సమాచారాన్ని నమ్మకూడదని, ప్రచారం చేయకూడదని కోరారు. ఏదైనా సమాచారం ఉంటే కార్యాలయం మాత్రమే అధికారిక సందేశాలను విడుదల చేస్తుందని ఆయన తెలిపారు.
News October 29, 2025
దేశవాళీ వరి.. ఒకసారి నాటితే 3 పంటలు పక్కా

ఒకసారి నాటితే 3 సార్లు కోతకు వచ్చే ‘తులసి బాసో’ దేశవాళీ వరి రకాన్ని సాగు చేస్తున్నారు చిత్తూరు(D) పలమనేరుకు చెందిన చందూల్ కుమార్‌రెడ్డి. ఇది సువాసన కలిగిన చాలా చిన్న గింజ వరి. మంచి పోషక, ఔషధ గుణాలు కలిగి తినడానికి మధురంగా ఉంటుంది. తొలి పంట 135 రోజులకు, 2వ పంట 60 నుంచి 70 రోజులకు, 3వ పంట 45 నుంచి 50 రోజులకు కోతకు వస్తుంది. ✍️ ప్రతిరోజూ ఇలాంటి కంటెంట్ కోసం <<-se_10015>>పాడిపంట కేటగిరీ<<>> క్లిక్ చేయండి.


