News October 28, 2025

‘యూనిటీ మార్చ్‌’లో యువత చురుగ్గా పాల్గొనాలి: ఎంపీ అరవింద్

image

ఉక్కు మనిషి సర్దార్‌ వల్లభ్‌భాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న ‘సర్దార్@150 యూనిటీ మార్చ్‌’లో యువత, విద్యార్థులు చురుగ్గా పాల్గొనాలని నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌ పిలుపునిచ్చారు. దేశ ఏకత, సమగ్రతకు పటేల్‌ స్ఫూర్తినిచ్చారని, ఆయన ఆదర్శాలను యువత అనుసరించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన నిజామాబాద్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జగిత్యాల జిల్లా విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు.

Similar News

News October 29, 2025

NTR: సెలవులపై క్లారిటీ ఇచ్చిన డీఈవో

image

ఎన్టీఆర్ జిల్లాలోని విద్యాసంస్థలకు ఈ నెల 31 వరకు సెలవులు ప్రకటించినట్లు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న సందేశం అవాస్తవమని డీఈవో సుబ్బారావు స్పష్టం చేశారు. ప్రధానోపాధ్యాయులు అధికారికంగా విడుదల కాని సమాచారాన్ని నమ్మకూడదని, ప్రచారం చేయకూడదని కోరారు. ఏదైనా సమాచారం ఉంటే కార్యాలయం మాత్రమే అధికారిక సందేశాలను విడుదల చేస్తుందని ఆయన తెలిపారు.

News October 29, 2025

దేశవాళీ వరి.. ఒకసారి నాటితే 3 పంటలు పక్కా

image

ఒకసారి నాటితే 3 సార్లు కోతకు వచ్చే ‘తులసి బాసో’ దేశవాళీ వరి రకాన్ని సాగు చేస్తున్నారు చిత్తూరు(D) పలమనేరుకు చెందిన చందూల్ కుమార్‌రెడ్డి. ఇది సువాసన కలిగిన చాలా చిన్న గింజ వరి. మంచి పోషక, ఔషధ గుణాలు కలిగి తినడానికి మధురంగా ఉంటుంది. తొలి పంట 135 రోజులకు, 2వ పంట 60 నుంచి 70 రోజులకు, 3వ పంట 45 నుంచి 50 రోజులకు కోతకు వస్తుంది. ✍️ ప్రతిరోజూ ఇలాంటి కంటెంట్ కోసం <<-se_10015>>పాడిపంట కేటగిరీ<<>> క్లిక్ చేయండి.

News October 29, 2025

గుండ్లకమ్మలో పడవ బోల్తా.. సిబ్బంది సేఫ్

image

అద్దంకి మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులు ముగ్గురు గుండ్లకమ్మ నదిలో పంపు హౌస్‌లో చిక్కుకున్న విషయం తెలిసిందే. వారిని రక్షించేందుకు మూడు గంటల నుంచి అధికారులు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్లని బయటికి తీసుకొచ్చేందుకు నదిలోకి పడవను పంపించారు. ప్రమాదవశాత్తు పడవ బోల్తా పడటంతో అందులో ఉన్న ఆరుగురు సిబ్బంది ప్రాణాపాయం నుంచి తప్పించుకొని చెట్లు ఎక్కారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.