News October 28, 2025

వనపర్తి: బాల్యవివాహాలు జరగకుండా ముందస్తు చర్యలు

image

వనపర్తి జిల్లాలో బాల్యవివాహాలు జరగకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎస్పీ గిరిధర్‌తో కలిసి జిల్లా స్థాయి బాలల పరిరక్షణ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వనపర్తి జిల్లాలో ఒక్క బాల్య వివాహం కూడా జరగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Similar News

News October 29, 2025

పల్నాడు జిల్లాకు ఇక ఇవి లేనట్టేనా.?

image

పల్నాడు జిల్లాకు ఆయు పట్టుగా ఉన్న పెదకూరపాడు నియోజకవర్గాన్ని అమరావతి జిల్లాలోకి మార్చాలనే ప్రతిపాదన మంత్రివర్గ ఉపసంఘం సీఎంతో చర్చించినట్లు సమాచారం. నియోజకవర్గంలోని 5 మండలాలు అమరావతి జిల్లా పరిధిలోకి రానున్నాయి. దీంతో పల్నాడు జిల్లా నుంచి చారిత్రాత్మక అమరావతి టెంపుల్, ధ్యాన బుద్ధ విగ్రహం, పులిచింతల ప్రాజెక్టు అమరావతి జిల్లా పరిధిలోనికి వెళ్లి బలమైన జిల్లాగా ఏర్పడనుంది.

News October 29, 2025

అల్లూరి జిల్లా కలెక్టర్ పేరిట ఫేక్ అకౌంట్..!

image

సైబర్ నేరగాళ్లు ఏకంగా అల్లూరి జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేశ్ కుమార్ పేరిట ఒక ఫేక్ సోషల్ మీడియా అకౌంట్‌ను సృష్టించారు. ప్రస్తుతం ఈ అంశం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. కలెక్టర్ దినేశ్ కుమార్ పేరిట మెసెంజర్‌లో నకిలీ అకౌంట్‌ను సృష్టించి, డబ్బులు కావాలని పలువురికి మెసేజ్‌లు పెడుతున్నారు. మంగళవారం ఈ విషయం వెలుగులోకి రావడంలో కలెక్టర్ అప్రమత్తమయ్యారు. ఈ మెసేజ్‌లకు ఎవరూ స్పందించవద్దని కలెక్టర్ సూచించారు.

News October 29, 2025

జీవిత సత్యం.. తెలుసుకో మిత్రమా!

image

జీవిత సత్యాన్ని తెలుసుకోవడానికి ఆసుపత్రి, జైలు, శ్మశానాన్ని సందర్శించాలని స్పిరిచ్యువల్, లైఫ్ కోచెస్ సూచిస్తున్నారు. ఆసుపత్రిలో ఆరోగ్యం విలువ, జైలులో ఒక తప్పుడు నిర్ణయం జీవితాన్ని ఎలా మారుస్తాయో తెలుస్తుంది. శ్మశానంలో ధనిక, పేద తేడా లేకుండా అందరూ ఒకే నేలలో కలిసిపోతారు. చివరికి మనం మిగిల్చిపోయే జ్ఞాపకాలు, మనతో తీసుకెళ్లే పశ్చాత్తాపాలే ముఖ్యమని ఈ మూడు వివరిస్తాయని చెబుతున్నారు. దీనిపై మీ కామెంట్.