News October 28, 2025
తీరాన్ని తాకిన తుఫాను.. 8-10 గం.లు జాగ్రత్త

AP: మొంథా తుఫాను కాసేపటి క్రితం <<18132869>>తీరాన్ని తాకింది<<>>. రాబోయే 8-10 గం. భారీ వర్షాలు, గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 10CM-20CM వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, గరిష్ఠంగా గంటకు 110 KM వేగంతో గాలులు వీస్తాయని చెప్పారు. 6-7 అడుగుల ఎత్తు వరకు అలలు ఎగసి పడతాయన్నారు. రేపు మధ్యాహ్నం నుంచి సాధారణ స్థితి నెలకొంటుందన్నారు.
Similar News
News October 29, 2025
దేశవాళీ వరి.. ఒకసారి నాటితే 3 పంటలు పక్కా

ఒకసారి నాటితే 3 సార్లు కోతకు వచ్చే ‘తులసి బాసో’ దేశవాళీ వరి రకాన్ని సాగు చేస్తున్నారు చిత్తూరు(D) పలమనేరుకు చెందిన చందూల్ కుమార్‌రెడ్డి. ఇది సువాసన కలిగిన చాలా చిన్న గింజ వరి. మంచి పోషక, ఔషధ గుణాలు కలిగి తినడానికి మధురంగా ఉంటుంది. తొలి పంట 135 రోజులకు, 2వ పంట 60 నుంచి 70 రోజులకు, 3వ పంట 45 నుంచి 50 రోజులకు కోతకు వస్తుంది. ✍️ ప్రతిరోజూ ఇలాంటి కంటెంట్ కోసం <<-se_10015>>పాడిపంట కేటగిరీ<<>> క్లిక్ చేయండి.
News October 29, 2025
ఇతిహాసాలు క్విజ్ – 50

1. తులసి దేవికి పూర్వ జన్మలో ఉన్న పేరు ఏంటి?
2. త్రిపురాంతకుడు అంటే ఏ దేవుడు?
3. కర్ణుడి కవచకుండలాలను దానం చేయమని కోరింది ఎవరు?
4. వాక్కుకు అధిష్టాన దేవత ఎవరు?
5. ఎవరి ఆజ్ఞ మేరకు పరశురాముడు తన తల్లి తల నరికాడు?
☛ సరైన సమాధానాలను సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
<<-se>>#Ithihasaluquiz<<>>
News October 29, 2025
నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు

CSIR-నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(NBRI) 17 MTS పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. టెన్త్, ఇంటర్ అర్హతగల అభ్యర్థులు నవంబర్ 25 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గల అభ్యర్థులకు ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500. SC,ST,PWBD,మహిళలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://nbri.res.in/


