News October 28, 2025
వాస్తురీత్యా ఇంటి గదులు ఎలా ఉండాలి?

ఇల్లు, గదుల నిర్మాణం దిక్కులకు అనుగుణంగా, ప్రాణశక్తి, ఉల్లాసాన్ని కలిగించేలా ఉండాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచించారు. ‘గదుల నిర్మాణం 4 మూలలతో ఉంటేనే గాలి, వెలుతురు సమతుల్యంగా ఉంటాయి. ఇంట్లోని గదులు ఏ మూల పెరిగినా, తగ్గినా వ్యతిరేక ఫలితాలు వచ్చే ప్రమాదం ఉంది. వృత్తాకార నిర్మాణాలు అతిథి గృహాలు, ఫంక్షన్ హాళ్లకే అనుకూలం. వాస్తు నియమాలు పాటిస్తే జీవితం హాయిగా ఉంటుంది’ అని పేర్కొన్నారు. <<-se>>#Vasthu<<>>
Similar News
News October 29, 2025
అజహరుద్దీన్‌కు మంత్రి పదవి

ఎల్లుండి తెలంగాణ మంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత, టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. నిన్న అజహరుద్దీన్, ఆయన కుమారుడు అసదుద్దీన్‌తో భేటీలో సీఎం రేవంత్ మంత్రి పదవిని ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రివర్గంలో మైనారిటీలు లేకపోవడంతో అవకాశం ఇచ్చినట్లు సమాచారం. MLCగా అజహరుద్దీన్ పేరును ప్రభుత్వం ఇప్పటికే గవర్నర్ వద్దకు పంపింది. దానికి ఆమోదం తెలపాల్సి ఉంది.
News October 29, 2025
‘మొంథా’ ఎఫెక్ట్.. అధికారులను అప్రమత్తం చేసిన సీఎం

TG: ‘మొంథా’ తుఫాను ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. వరికోతల సమయం కావడంతో ఆరబోసిన ధాన్యానికి నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. చెరువులు, రిజర్వాయర్ల నీటిమట్టాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించాలని తెలిపారు. రోడ్లపై నీరు నిలిచిన ప్రాంతాల్లో, లోలెవల్ బ్రిడ్జిలపై నుంచి రాకపోకలు నిషేధించాలని ఆదేశించారు. హైడ్రా, ఇతర రెస్క్యూ సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు.
News October 29, 2025
మహిళల ఆహారంలో ఉండాల్సిన పోషకాలివే..

ఒక మహిళ అమ్మగా, భార్యగా, ఉద్యోగినిగా, నాయకురాలిగా ఎన్నో పాత్రలు పోషించాల్సి ఉంటుంది. అందుకే ఆమె ఆరోగ్యం పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు. మహిళల ఆహారంలో కచ్చితంగా ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి, విటమిన్ డి, కాల్షియం, మెగ్నీషియం ఉండేలా చూసుకోవాలంటున్నారు. వీటికోసం నట్స్, పాలకూర, ఓట్స్, పాల ఉత్పత్తులు, గుమ్మడి గింజలు, అవకాడో ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు.


