News October 28, 2025

‘జగిత్యాలకు రూ.62.50 కోట్ల అభివృద్ధి నిధులు’

image

JGTL మున్సిపాలిటీకీ అత్యధికంగా రూ.62.50 కోట్ల నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. ప్రెస్ మీట్‌లో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. CMను కలిసి వినతిపత్రం ఇచ్చిన వెంటనే నిధులు ఆమోదించారని చెప్పారు. ఇప్పటికే కరెంట్, డ్రైనేజీ, రోడ్లు, నీటి సరఫరా పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. అర్బన్ హౌసింగ్ కాలనీకి రూ.20 కోట్లు ప్రతిపాదనలు పంపామని, జగిత్యాల జిల్లా అభివృద్ధిలో TGకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు.

Similar News

News October 29, 2025

సంగారెడ్డి: ‘శిథిలావస్థ తరగతి గదుల్లో బోధన వద్దు’

image

జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో శిథిలావస్థలో ఉన్న తరగతి గదుల్లో బోధన నిర్వహించవద్దని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఆదేశించారు. పాఠశాలలో ప్రమాదకరంగా ఉన్న గదుల స్థానంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, ఈ విషయాన్ని హెచ్ఎంలు తప్పక గమనించాలని సూచించారు. విద్యార్థుల భద్రతే ప్రధానమని, ఏవైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న గదుల్లో తరగతులు నిర్వహించకూడదని స్పష్టం చేశారు.

News October 29, 2025

పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు

image

పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10వేల జరిమానా విధిస్తూ కొత్తగూడెం మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి (పోక్సో స్పెషల్ జడ్జ్) ఎస్.సరిత మంగళవారం తీర్పు చెప్పారు. మణుగూరు(M) వాగు మల్లారానికి చెందిన మైనర్ బాలికపై జానంపేటకు చెందిన గాడిద శ్రీనివాస్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ కేసులో 11 మంది సాక్షులను విచారించగా శ్రీనివాస్‌పై నేరం రుజువైంది. దాంతో శిక్ష పడింది.

News October 29, 2025

పార్వతీపురం మన్యం జిల్లాలో 643mm వర్షపాతం

image

పార్వతీపురం మన్యం జిల్లాలో గడిచిన 24గంటల్లో 643mm వర్షపాతం నమోదైనట్లు అధికారులు బుధవారం తెలిపారు. అత్యధికంగా పాచిపెంట68.2mm, అత్యల్పంగా వీరఘట్టం28.8mm నమోదుకాగా భామిని 50.9mm, జియ్యమ్మవలస 35.8mm, సీతంపేట 66.9mm, గుమ్మలక్ష్మీపురం39.2mm, కొమరాడ29.4mm, కురుపాం36.3mm, Gbl44.2.8mm, సాలూరు48.1mm, పార్వతీపురం34.6, పాలకొండ47.2mm, మక్కువ 41.8mm, సీతానగరం 29mm, బలిజిపేట42.6mm వర్షపాతం నమోదయ్యిందన్నారు.