News October 28, 2025
ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్‌లో భారీ అవకతవకలు: బీఆర్ నాయుడు

ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్‌లో ఉన్న కొందరు ఉద్యోగులు భారీ అవకతవకలకు పాల్పడినట్లు తమ దృష్టికి వచ్చిందని TTD చైర్మన్ BR నాయుడు తెలిపారు. పాలకమండలి సమావేశం అనంతరం ఆయన మాట్లాడారు. ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్ ఉద్యోగుల అవినీతిపై ACB విచారణ చేయాలని తీర్మానం చేశామన్నారు. అనేక వస్తువులు కొనుగోళ్లలో గోల్ మాల్ సాగినట్లు తెలిసిందన్నారు. ఉదాహరణకు బయట రూ.400కొనే శాలువలు రూ.1300 కొన్నట్లు తెలిసిందన్నారు.
Similar News
News October 29, 2025
ఇంటి చిట్కాలు

* ఓవెన్‌ని క్లీన్ చేయడానికి ఒక బౌల్‌లో నిమ్మ ముక్కల్ని వేసి ఓవెన్‌లో పెట్టి 5 నిమిషాలు ఉంచాలి. తర్వాత ఒక తడి క్లాత్‌తో ఓవెన్‌ని తుడిస్తే సరిపోతుంది.
* గ్లాస్ ఓవెన్ డోర్‌పై బేకింగ్ సోడా-నీళ్లు కలిపి రాసి పొడి క్లాత్‌తో తుడిస్తే మరకలు వదిలిపోతాయి.
* కిచెన్ సింక్, వాష్‌బేసిన్లపై పడే మరకలపై టూత్‌పేస్ట్ పూసి అరగంట పాటు అలాగే వదిలేయాలి. ఆపై స్పాంజ్‌తో రుద్ది కడిగేస్తే మరకలు సులభంగా వదిలిపోతాయి.
News October 29, 2025
60 మంది డ్రగ్ పెడ్లర్ల కాల్చివేత

2,500మంది బ్రెజిల్ పోలీసులు, జవాన్లు రియోలో డ్రగ్ ట్రాఫికింగ్ గ్యాంగ్‌పై సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. 60మంది అనుమానితులను కాల్చివేశారు. 81 మందిని అరెస్ట్ చేశారు. నలుగురు పోలీసులూ చనిపోయారు. 93 రైఫిల్స్, 500కిలోల డ్రగ్స్ సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో హెలికాప్టర్లు, ఆర్మ్‌డ్ వెహికల్స్ ఉపయోగించారు. ఈ దాడిని UN హ్యూమన్ రైట్స్ ఆఫీస్ ఖండించింది. విచారణ చేపట్టాలని డిమాండ్ చేసింది.
News October 29, 2025
GNT: తుపాను దెబ్బకు వరి పంటలపై ఆందోళన

మొంథా తుపాను ప్రభావంతో మంగళవారం కురిసిన వర్షాలు రైతులను కలవరపెడుతున్నాయి. గుంటూరు, బాపట్ల జిల్లాల్లో వరి పంటలు ఈనె, గింజ పాలుదశల్లో ఉండగా భారీ వర్షం, గాలుల తాకిడికి నేలవాలుతున్నాయి. ఇప్పటికే 20 శాతం వరి పంటలు నష్టపోయినట్లు అంచనా. పంట తాలుగా మారే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్టోబరులోనే తుపాను రావడంతో కోత ముందు కష్టాలు పెరిగాయని చెబుతున్నారు.


