News October 29, 2025
విద్యుత్ కనెక్షన్ కట్ చేస్తారేమోనని ట్రాన్స్‌ఫార్మర్ ఎత్తుకెళ్లాడు

బకాయిల కోసం కరెంట్ కనెక్షన్‌ను కట్ చేస్తారేమోనని ఏకంగా ప్రభుత్వ ట్రాన్స్‌ఫార్మర్‌ను తీసుకుపోయాడో వ్యక్తి. మధ్యప్రదేశ్‌లోని భిండి జిల్లాలో ఇది జరిగింది. నిందితుడు శ్రీరామ్ బిహారీ త్రిపాఠి ₹1,49,795 బకాయి పడ్డాడు. సిబ్బంది ఇంటి కనెక్షన్‌తో పాటు అక్కడి 25KV ట్రాన్స్‌ఫార్మర్‌నూ తీసేస్తారని భావించాడు. దీంతో దాన్నితొలగించి ఇంటికి తీసుకుపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి పరికరాలు స్వాధీనం చేసుకున్నారు.
Similar News
News October 29, 2025
సినిమాల్లోకి మహేశ్ బాబు మేనకోడలు!

సూపర్ స్టార్ కృష్ణ మనవరాలు, మంజుల కుమార్తె జాన్వీ స్వరూప్ త్వరలోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో మహేశ్ మేనకోడలు మూవీల్లోకి ఎంట్రీ ఇస్తున్నారంటూ SMలో ఫొటోలు ట్రెండ్ అవుతున్నాయి. గతంలో ‘మనసుకు నచ్చింది’ చిత్రంలో జాన్వీ చైల్డ్ ఆర్టిస్టుగా నటించారు. మూవీస్‌లోకి రావాలని ఆమె డ్రైవింగ్, డాన్స్, ఫిట్‌నెస్ వంటి అంశాల్లో శిక్షణ తీసుకున్నట్లు సమాచారం.
News October 29, 2025
దేవుడు ఎవరిపై అనుగ్రహం చూపుతాడంటే?

‘భక్త్యాత్యనన్యయా శక్యః’ అంటుంది భగవద్గీత. అంటే అనన్య భక్తి కల్గిన వారికే దేవుడు స్వాధీనమవుతాడని అర్థం. ఎలాంటి ఆశలు లేకుండా, కేవలం భగవంతుడిపైనే విశ్వాసం ఉంచి, ఆయనతో నిలబడే భక్తులపైనే ఆయన అనుగ్రహం ఉంటుంది. అనన్య భక్తితో పూజ, సేవ, నామస్మరణ, కీర్తన, జపం, ధ్యానం వంటి సాధనలు చేసే వారికి, ఆ దేవుడు కేవలం స్వామీ, రక్షకుడే కాకుండా, వారి హృదయాలలో సులభంగా లభించేవాడుగా, స్వాధీనమయ్యేవాడుగా ఉంటాడు. <<-se>>#WhoIsGod<<>>
News October 29, 2025
ఇందిరా గాంధీ హాస్పిటల్‌లో ఉద్యోగాలు

ఢిల్లీలోని ఇందిరా గాంధీ హాస్పిటల్ 26 రెసిడెంట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. మెడిసిన్, పీడియాట్రిక్స్, అనస్తీషియా, జనరల్ సర్జరీ, గైనకాలజీ, రేడియో-డయాగ్నోసిస్ ఉద్యోగాలు ఉన్నాయి. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో MD, DNB, డిప్లొమా అర్హతగల అభ్యర్థులు నవంబర్ 7 వరకు ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. వెబ్‌సైట్: https://igh.delhi.gov.in/


