News April 10, 2024
కేయూ డిగ్రీ కోర్సుల పరీక్షల టైం టేబుల్

KU పరిధి డిగ్రీ కోర్సుల పరీక్షలకు సంబంధించి KU పరీక్షల నియంత్రణాధికారి నర్సింహాచారి నోటిఫికేషన్ విడుదల చేశారు. BA, Bcom, BSC, BCA BBA BA(ఎల్ఎం)కు సంబంధించిన 2వ, 6వ సెమిస్టర్ పరీక్షలు మే 6 నుంచి ప్రారంభం కానున్నాయి. డిగ్రీ కోర్సుల 4వ సెమిస్టర్ పరీక్షలు మే 7 నుంచి జరగనున్నాయి. 2వ సెమిస్టర్ పరీక్షలు మే 6, 8, 10, 16, 18, 21, 23, 25 తేదీల్లో మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు.
Similar News
News January 5, 2026
10 నిమిషాల్లోనే సమస్యకు వరంగల్ కలెక్టర్ చెక్

ప్రజావాణిలో 10 సంవత్సరాలు పూర్తికాని సమస్యను పది నిమిషాల్లో వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పరిష్కరించారు. దరఖాస్తుదారుడు ఏనుగు సుదర్శన్ రెడ్డి తన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ మ్యుటేషన్ పెండింగ్ సమస్యపై తీవ్ర ఆవేశంతో వచ్చారు. సమస్య పరిష్కారం కావడంతో ప్రశాంతంగా వెళ్లారు. సమస్య ఏదైనా ప్రశాంతంగా పరిష్కారం అవుతుందని కలెక్టర్ భరోసా ఇచ్చారు.
News January 4, 2026
హాల్టికెట్లలో మార్పులుంటే చేసుకోవచ్చు: డీఐఈవో

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల హాల్టికెట్లలో ఏవైనా మార్పులు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు వరంగల్ డీఐఈవో డాక్టర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. ఇంటర్నెట్ లో హాల్టిక్కెట్ల ప్రివ్యూను బోర్డు ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. నమూనా హాల్ టికెట్లలో పరిశీలించి ఏవేని మార్పులున్నట్లయితే ప్రిన్సిపాళ్లను సంప్రదించాలన్నారు. పరీక్షల నిర్వహణ తేదీల్లో ఎలాంటి మార్పులు ఉండవన్నారు.
News January 4, 2026
WGL: మున్సిపల్ రిజర్వేషన్లపై తీవ్ర ఉత్కంఠ..!

మున్సిపల్ ఎన్నికల పోరు సిద్ధమవుతోందన్న సంకేతాలు జిల్లాలో తీవ్ర స్థాయిలో కనిపిస్తున్నాయి. ఓటర్ల జాబితా, వార్డుల విభజన ప్రక్రియ వేగంగా సాగుతోంది. పార్టీ గుర్తుపై జరిగే ఈ ఎన్నికలు ప్రధాన పార్టీలకు పెద్ద సవాలుగా మారనున్నాయి. ఈ నేపథ్యంలో రిజర్వేషన్లపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. జిల్లాలోని వర్ధన్నపేట, నర్సంపేట మున్సిపాలిటీల్లో ఛైర్మన్, వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఎలా ఉంటాయో..? అనే చర్చ జరుగుతోంది.


