News October 29, 2025
మంచిర్యాల: నవంబర్ 3 నుంచి పత్తి కొనుగోళ్లు

మంచిర్యాల జిల్లాలోని 2 జిన్నింగ్ మిల్లుల్లో నవంబర్ 3వ తేదీ నుంచి సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లు ప్రారంభిస్తున్నట్లు జిల్లా మార్కెటింగ్ అధికారి షహాబుద్ధిన్ తెలిపారు. జిల్లాలోని తాండూరు మండలం మహేశ్వరి కాట్స్, దండేపల్లి మండలం వెంకటేశ్వర చిన్ని మిల్లులలో కొనుగోళ్లు ప్రారంభిస్తున్నామన్నారు. పత్తి రైతులు తప్పనిసరిగా కాపాస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకుని మాత్రమే పత్తిని విక్రయించాలన్నారు.
Similar News
News October 29, 2025
వికారాబాద్ జిల్లాలో అక్రమ దందా..!

వికారాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఇసుక పక్క దారి పడుతోంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం పొందిన అనుమతులను దుర్వినియోగం చేస్తూ, ఇసుకను అక్రమంగా తరలించి, బయట మార్కెట్‌లో విక్రయిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే నాయకులు ఈ అక్రమ రవాణాను ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలు మాత్రం భారీగా వినిపిస్తున్నాయి. పోలీసులు వాహనాలు ఆపితే చాలు ఒక బడా నాయకుడితో ఫోన్ చేయిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
News October 29, 2025
డౌన్స్ సిండ్రోమ్ పిల్లలకు ఈ పరీక్షలు చేయిస్తున్నారా?

డౌన్స్ సిండ్రోమ్ ఉన్న పిల్లలకు క్రమం తప్పకుండా కొన్ని వైద్య పరీక్షలు చేయించాలని వైద్యులు చెబుతున్నారు. ఏడాదికోసారి కంటి పరీక్షలు, 6-12 నెలలకు ఒకసారి చెవి పరీక్షలు చేయించాలి. ప్రతి ఆర్నెల్లకోసారి దంత పరీక్షలు, 3-5 ఏళ్లకోసారి ఛాతీ, మెడ భాగాన్ని ఎక్స్‌రే తీసి పరీక్షిస్తూ ఉండాలి. అమ్మాయిల్లో యుక్త వయసు రాగానే పాప్ స్మియర్ పరీక్ష, సంవత్సరానికోసారి థైరాయిడ్ పరీక్ష చేయిస్తూ ఉండాలని సూచిస్తున్నారు.
News October 29, 2025
49 ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL) ఘజియాబాద్‌లో 49 ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ, టెక్నీషియన్-C పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. ఇంటర్, ITI, డిప్లొమా అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. షార్ట్ లిస్ట్, రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.590, SC/ST/PWBDలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://bdl-india.in/


