News October 29, 2025

పెద్దపల్లి ప్రయాణికులకు RTC గుడ్ న్యూస్

image

కార్తీక మాసాన్ని పురస్కరించుకొని NOVలో ప్రయాణికుల కోసం GDK డిపో ప్రత్యేక యాత్ర ప్యాకేజీలను ప్రకటించింది. ఈ యాత్రల ద్వారా వివిధ పుణ్యక్షేత్రాలకు వెళ్లే సౌకర్యాన్ని కల్పించింది. NOV 4న యాదాద్రి, 6న శ్రీశైలం, 11న రామేశ్వరం(7 DAY’S), 18న శ్రీశైలం, 23న కాశీ, అయోధ్యకు స్పెషల్ సూపర్ లగ్జరీ, రాజధాని బస్సులను ఏర్పాటు చేశామని DM నాగభూషణం తెలిపారు. మరిన్ని వివరాలకు 7013504982 నంబరును సంప్రదించాలన్నారు.

Similar News

News October 29, 2025

సిద్దిపేట: వారి రూటే సప”రేటు”..!

image

సిద్దిపేటలోని సిటిజెన్ క్లబ్‌లో సిద్దిపేట పోలీసులు ఈరోజు తనిఖీ నిర్వహించి వారి వద్ద నుంచి మొబైల్స్, కాయిన్స్‌లను స్వాధీనం చేసుకుని 50 మందిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. తనిఖీల్లో వారి రూటే సపరేటు అన్నట్టు తెలిసింది. ప్లేకార్డులు ఆడేటప్పుడు ఎవరికీ అనుమానం రాకుండా స్కోర్ కార్డు ఏర్పాటు చేశారు. గేమ్ అయిపోయాక క్లబ్ బయటకు వెళ్లి డబ్బులు పంచుకుంటారట. ఇది తెలిసి పోలీసులు అవాక్కయ్యారు.

News October 29, 2025

ప్రజలకు సవలందించడంలో గరిమా ముందుంటారు: సిద్దిపేట కలెక్టర్

image

ఉత్తమ అధికారిగా ప్రజలకు సేవలందించడంలో గరీమ అగ్రవాల్ ఎప్పుడు ముందుంటారని జిల్లా కలెక్టర్ కే.హైమావతి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్‌గా బదిలీపై వెళ్లి రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ గరీమ అగ్రవాల్‌ను మంగళవారం సాయంత్రం కలెక్టర్ ఘనంగా సన్మానించారు.

News October 29, 2025

HYD: రేపు మెగా జాబ్ మేళా

image

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. HYD సిటీ పోలీస్ సౌత్ వెస్ట్ జోన్ ఆధ్వర్యంలో OCT 30న గుడిమల్కాపూర్ రూప్ గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో మెగా జాబ్ మేళా ఉండనుంది. 10వ తరగతి ఉత్తీర్ణత, ఫెయిల్ అయినవారి నుంచి డిగ్రీ హోల్డర్స్ వరకు అందరూ అర్హులే. ఐటీ, బ్యాంకింగ్, లాజిస్టిక్స్, సాఫ్ట్‌వేర్, ఫార్మసీ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. పూర్తి వివరాలకు 87126 61501ను సంప్రదించండి.
SHARE IT