News October 29, 2025
నేడు పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

AP: తుఫాన్ వల్ల పత్తి రైతులు నష్టపోకూడదని తక్షణమే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 30 కొనుగోలు కేంద్రాలు నేడు ప్రారంభం కానున్నాయి. క్వింటాలుకు ₹8,110 మద్దతు ధర ఖరారు చేశారు. రైతులు ముందుగా రైతు సేవా కేంద్రాల ద్వారా తమ వివరాలను CM యాప్‌లో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ద్వారా నమోదు చేసుకోవాలి. తర్వాత ‘కపాస్ కిసాన్’ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకోవాలి.
Similar News
News October 29, 2025
భారీ వర్షంతో తొలి టీ20 రద్దు

ఆస్ట్రేలియా-భారత్ మధ్య కాన్‌బెర్రాలో జరిగే తొలి టీ20 రద్దయింది. వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుండటంతో మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా దూకుడుగా ఆడింది. 9.4 ఓవర్లలో 97/1 రన్స్ చేసింది. అభిషేక్ 19 రన్స్ చేసి ఔటవ్వగా.. గిల్ 37*, సూర్య 39* దూకుడుగా ఆడారు.
News October 29, 2025
అర్ష్‌దీప్ బదులు హర్షిత్.. నెటిజన్ల ఆగ్రహం

ఆస్ట్రేలియాతో తొలి టీ20లో అర్ష్‌దీప్ సింగ్ బదులు హర్షిత్ రాణాను ప్లేయింగ్-11లోకి తీసుకోవడంపై నెటిజన్లు టీమ్ మేనేజ్‌మెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన అర్ష్‌దీప్‌ను ఎందుకు పక్కనబెట్టారని ప్రశ్నిస్తున్నారు. హర్షిత్‌కు గంభీర్ సపోర్ట్ ఎక్కువగా ఉందని, బీసీసీఐలో రాజకీయాలు ఎక్కువ అయ్యాయని ఫైర్ అవుతున్నారు. దీనిపై మీ కామెంట్?
News October 29, 2025
ఆవు పాల అభిషేకంతో కష్టాల నుంచి విముక్తి

కార్తీక మాసంలో శివారాధన గొప్ప ఫలితాలనిస్తుందని మనకు తెలిసిందే. అందుకే చాలామంది శివాలయాలకు వెళ్లి శివలింగాలకు అభిషేకాలు చేస్తుంటారు. అయితే శివుడికి ఆవు పాలతో అభిషేకం చేయడం అత్యంత పవిత్రమని పండితులు సూచిస్తున్నారు. ఈ అభిషేకం ద్వారా కష్టాలు తొలగిపోతాయని అంటున్నారు. ‘గోమాత పాలు శుభాలకు, పవిత్రతకు చిహ్నం. ఈ అభిషేకం వల్ల శివుడు సంతృప్తి చెంది, జీవితంలో సుఖశాంతులు నెలకొనేలా ఆశీర్వదిస్తాడు’ అంటున్నారు.


