News October 29, 2025

MBNR: కురుమూర్తి.. ఈ డిపోల నుంచి ప్రత్యేక బస్సులు

image

మహబూబ్ నగర్ జిల్లాలోని కురుమూర్తి జాతర సందర్భంగా ఆయా డిపోల నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు మహబూబ్ నగర్ రీజనల్ మేనేజర్ సంతోష్ కుమార్ Way2Newsతో తెలిపారు. నేటి నుంచి మహబూబ్‌నగర్-20, నాగర్‌కర్నూల్-15, వనపర్తి-15, కొల్లాపూర్-6, నారాయణపేట-4 డిపోల నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని, భక్తులు, ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Similar News

News October 29, 2025

HYDలో భారీ వర్షం.. ఈ మెసేజ్ వచ్చిందా?

image

HYD, RR, MDCL జిల్లాలో వర్ష తీవ్రత మరింత పెరగనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని Telangana Integrated Command and Control Centre (TGiCCC) తెలిపింది. గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండడంతో ప్రజలు బయటకు రావొద్దని సూచించింది. ఫోన్లకు హెచ్చరిక మెసేజ్‌లు పంపింది. మీకూ వచ్చాయా?

‘మొంథా’తో ఏపీకి తీవ్ర నష్టం: CBN

image

‘మొంథా’తో ఏపీకి తీవ్రనష్టం వాటిల్లిందని CM CBN తెలిపారు. తుఫాను తాకిన ప్రాంతంలో తీవ్ర గాలులు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలతో నష్టం వాటిల్లిందని వివరించారు. ‘ఈ పెనువిపత్తును ముందస్తు జాగ్రత్తలతో సమర్థంగా ఎదుర్కొన్నాం. ఎక్కువ ప్రాణ నష్టం, ఆస్తినష్టం లేకుండా కాపాడుకోగలిగాం. 200 క్యాంపుల్లో 1.80 లక్షల మందికి ఆశ్రయమిచ్చాం. యంత్రాంగం సమష్టిగా పనిచేసి ప్రజలను కాపాడింది’ అని వెల్లడించారు.