News October 29, 2025
గజ్వేల్: వాచ్‌మెన్ దారుణ హత్య.. ఇద్దరు పరారీ

వాచ్‌మెన్ దారుణ హత్యకు గురైన ఘటన గజ్వేల్‌లో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఆడెపు బాలయ్య గజ్వేల్‌లోని Vమార్ట్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి విధులకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు వెతకగా సమీపంలోని చెట్లల్లో అతడి మృతదేహం లభ్యమైంది. బాలయ్యతోపాటు పనిచేస్తున్న బిహార్‌కు చెందిన ఇద్దరు వాచ్‌మెన్‌లు పరారీలో ఉండటంతో వారే హత్య చేసి ఉండొచ్చని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు.
Similar News
News October 29, 2025
రేపు విశాఖపట్నంలో పాఠశాలలకు సెలవు

తుపాన్ కారణంగా విశాఖపట్నం జిల్లాలో గురువారం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ డీఈవో ప్రేమ్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. తుపాను బుధవారం మధ్యాహ్నం తీరం దాటినప్పటికీ, ఈదురు గాలులతో వర్షం భారీగా పడే అవకాశం ఉందని.. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా సెలవు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన విద్యాసంస్థలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News October 29, 2025
అజహరుద్దీన్‌కు మంత్రి పదవి.. BJP అభ్యంతరం!

TG: అజహరుద్దీన్‌కు <<18140326>>మంత్రి<<>> పదవి ఖాయమని జరుగుతున్న ప్రచారంపై రాష్ట్ర బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి క్లారిటీ వచ్చాక ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. కాగా జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు ముందు రాజకీయ లబ్ధి పొందేందుకు కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుందని బీజేపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.
News October 29, 2025
మాదకద్రవ్యాల నివారణకు కృషి చేయాలి: ASF కలెక్టర్

జిల్లాలో మాదక ద్రవ్యాల నివారణకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. బుధవారం ఎస్పీ కాంతిలాల్ పాటిల్‌తో కలిసి జిల్లాలో మాదకద్రవ్యాల నివారణపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాను మాదకద్రవ్య రహితంగా తీర్చిదిద్దాలని సూచించారు.


