News October 29, 2025
HYD: భారీగా బకాయిలు.. నల్లా కనెక్షన్ కట్!

HYD జలమండలికి దాదాపు రూ.1,300 కోట్లకుపైగా బకాయిలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో నగరవాసుల నల్లా ఛార్జీలే రూ.147కోట్లు వసూలు కావాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఈ మేరకు నల్లా బిల్లును పూర్తిగా వసూలు చేసేందుకు నగరంలో చర్యలు షురూ అయ్యాయి. బకాయి ఉన్న వినియోగదారులకు ముందుగా నోటీసులు జారీ చేస్తారు. గడువు ముగిసినా చెల్లించకపోతే వారికి నీటి సరఫరా నిలిపివేసి, వసూలుకు చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం.
Similar News
News October 29, 2025
అక్రమ దత్తత.. ఏడుగురు అరెస్ట్: నల్గొండ ఎస్పీ

2 వేర్వేరు కేసులలో 10 రోజుల ఆడ శిశువును, 21 రోజుల మగ శిశువును అక్రమ దత్తత చేసిన ఏడుగురు వ్యక్తులను జిల్లా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ బుధవారం వెల్లడించారు. ఆడపిల్ల పుట్టిందని భారంగా భావించి ఒకరు, డబ్బుల కోసం మరొకరు కన్నపేగు బంధం మరిచి పిల్లలను అమ్ముకోగా.. జిల్లా పోలీసులు ఇద్దరు చిన్నారులను రక్షించి శిశు గృహకు తరలించారు.
News October 29, 2025
ఏడాదిలో 69 గంజాయి కేసులు: ASF ఎస్పీ

గంజాయి సాగు, అక్రమ రవాణా, వినియోగంపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని ఆసిఫాబాద్ ఎస్పీ కాంతిలాల్ పాటిల్ తెలిపారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 69 కేసులు నమోదు చేసి 120 మందిని జైలుకు పంపించామన్నారు. సంబంధిత శాఖల అధికారులు పోలీసు శాఖతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.
News October 29, 2025
రేపు విశాఖపట్నంలో పాఠశాలలకు సెలవు

తుపాన్ కారణంగా విశాఖపట్నం జిల్లాలో గురువారం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ డీఈవో ప్రేమ్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. తుపాను బుధవారం మధ్యాహ్నం తీరం దాటినప్పటికీ, ఈదురు గాలులతో వర్షం భారీగా పడే అవకాశం ఉందని.. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా సెలవు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన విద్యాసంస్థలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.


