News October 29, 2025

కాగజ్‌నగర్: ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ పేరిట మోసం.. వ్యక్తి అరెస్ట్

image

స్టాక్స్, ఐపీఓ ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ పేరిట ప్రజలను మోసం చేసిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేశామని కాగజ్‌నగర్ డీఎస్పీ వహీదోద్దీన్ మంగళవారం తెలిపారు. నిందితుడు స్టాక్స్, ఐపీఓ ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో వాట్సాప్ గ్రూపును క్రియేట్ చేసి 108 మందిని అందులో చేర్చి పెట్టుబడుదారులను మోసం చేసినట్లు తెలిపారు. అందులో 26 ట్రాన్సాక్షన్స్ ద్వారా రూ.76,50,000 ఇన్వెస్ట్ చేశాడని పేర్కొన్నారు.

Similar News

News October 29, 2025

శ్రీకాకుళం: పొలాల్లో వాన నీరు..రైతు కంట కన్నీరు

image

‘మొంథా’ తుపాన్ ప్రభావానికి భారీ వర్షాలు, ఈదురు గాలులకు శ్రీకాకుళం జిల్లాలోని 2,230.29 హెక్టారాల్లో పంట నష్టం సంభవించింది. ఈ విపత్తుతో 4,801 మంది రైతులు నష్టపోయారు. వరి 2,227.5 హెక్టార్లు, ఉద్యాన పంటలు 2.79 హెక్టార్లు దెబ్బతిన్నాయి. అత్యధికంగా ఇచ్ఛాపురం 1,118 హెక్టార్లలో వరికి నష్టం జరిగిందని అధికారులు నివేదిక ఇచ్చారు. పొలాల్లో నీటిని మళ్లించి, సాగును కాపాడుకునేందుకు రైతులు పాట్లు పడుతున్నారు.

News October 29, 2025

ఖైరతాబాద్: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి BRS ఫిర్యాదు

image

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సీ.సుదర్శన్ రెడ్డిని బుధవారం బీఆర్ఎస్ నేతలు కలిశారు. కాంగ్రెస్ నేతలపై ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా రేవంత్ రెడ్డి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, హామీలు గుమ్మరించి ఓట్లు దండుకునేందుకు చూస్తున్నారని పేర్కొన్నారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, గంగుల కమలాకర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కలిసి ECకి ఫిర్యాదు చేశారు.

News October 29, 2025

సిద్దిపేట జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు

image

మొంతా తుఫాన్ ప్రభావంతో సిద్దిపేట జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గురువారం అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. జిల్లా కలెక్టర్ హైమావతి ఆదేశాల మేరకు జూనియర్, డిగ్రీ, రెసిడెన్షియల్, స్కూల్స్ అన్నింటికీ ఈ సెలవు వర్తిస్తుందని వెల్లడించారు.