News October 29, 2025
NGKL:అన్నవరం, పంచారామ క్షేత్రాలకు.. సూపర్ లగ్జరీ బస్

నాగర్ కర్నూల్ డిపో నుంచి ప్రముఖ పుణ్య క్షేత్రాల సందర్శన కోసం సూపర్ లగ్జరీ బస్సును నడుపుతున్నట్లు డిపో మేనేజర్ యాదయ్య Way2Newsతో తెలిపారు. ఈనెల 30న రాత్రి 8 గంటలకు బస్సు బయలుదేరి అన్నవరం, ద్రాక్షారామం, భీమవరం, విజయవాడ కనకదుర్గ, మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలను సందర్శిస్తుందని చెప్పారు. పూర్తి వివరాలకు 94904 11590, 94904 11591 సంప్రదించాలన్నారు. ఒక్కొక్కరికి రూ.3వేలు(ప్యాకేజ్) ధర ఉంటుందన్నారు.
Similar News
News October 31, 2025
సీఎం సారూ.. ఖమ్మం రండి: ముంపు వాసులు

ఖమ్మంలో మున్నేరు ముంపు వాసులను ఆదుకోవాలన్న డిమాండ్ వినిపిస్తుంది. 26 అడుగులకు పైగా మున్నేరు ప్రవహించిన నేపథ్యంలో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. అయితే వరదతో జరిగిన నష్టాన్ని తెలుసుకునేందుకు సీఎం రేవంత్ ఈ రోజు వరంగల్‌లో ఏరియల్ సర్వే చేస్తున్నారు. ఖమ్మంలో పర్యటించడం లేదు. దీంతో ముంపు వాసులు సీఎం తమ ప్రాంతంలో పర్యటించి తమను ఆదుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
News October 31, 2025
HYD: అజ్జూ భాయ్ చుట్టూ పొలిటికల్ డ్రామా

ఇపుడు చర్చ జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంపై కాకుండా మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ చుట్టూ సాగుతోంది. కారణం ఆయనకు కాంగ్రెస్ మంత్రి పదవి ఇస్తుండటం వల్లే. ఈ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నాయి. ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న అతడికి మంత్రి పదవి ఎలా ఇస్తారని బీజేపీ నాయకులు, ఆయన దేశానికి చేసిన సేవను బీజేపీ గుర్తించడం లేదని కాంగ్రెస్ నేతలు.. ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలకు దిగారు.
News October 31, 2025
INDvsAUS రెండో టీ20కి వర్షం ముప్పు

భారత్, ఆస్ట్రేలియా మధ్య ఇవాళ రెండో T20 జరగనుంది. అయితే మెల్‌బోర్న్‌లో మ్యాచ్ జరిగే టైమ్‌కి 93% వర్షం పడే అవకాశాలున్నాయని AccuWeather పేర్కొంది. వర్షం ఆగితే మైదానాన్ని ఆరబెట్టే టెక్నాలజీ అక్కడ ఉంది. కానీ వర్షం నుంచి బ్రేక్ లభించే అవకాశాలు తక్కువేనని తెలిపింది. ఈ మైదానంలో T20ల్లో ఇరు జట్లు 4సార్లు తలపడగా చెరో 2మ్యాచులు గెలిచాయి. కాన్‌బెర్రాలో జరగాల్సిన తొలి T20 వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే.


