News April 10, 2024
టెక్కలి ఎమ్మెల్యే పీఠం ఎవరిదో?

టెక్కలి నియోజకవర్గంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో ముగ్గురు మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. మాజీ మంత్రి కిల్లి కృపారాణి వైసీపీని వీడి షర్మిల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన తర్వాత ఇక్కడ రాజకీయం రసవత్తరంగా మారింది. వైసీపీ నుంచి దువ్వాడ శ్రీనివాస్, టీడీపీ కూటమి అభ్యర్థి కింజరాపు అచ్చెన్నాయుడు పోటీలో ఉన్నారు. 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ గెలుపొందింది. 2024లో గెలుపు ఎవరిదనే ఉత్కంఠ నెలకొంది.
Similar News
News April 22, 2025
శ్రీకాకుళం: అమ్మా నేనొస్తున్నా అంటూనే..!

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం లొద్దపుట్టి RH కాలనీలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన నెయ్యల గోపాల్ తగరపువలసలోని అవంతి ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్నాడు. ‘అమ్మా.. నేను ఇంటికి వస్తున్నా’ అంటూ తల్లికి కాల్ చేశాడు. ఎంతకీ ఇంటికి రాకపోవడంతో కాలేజీలో సంప్రదించారు. విజయనగరం రైల్వే స్టేషన్ పరిసరాల్లో గోపాల్ అనుమానాస్పదంగా చనిపోయాడని కాలేజీ ప్రతినిధులు తల్లికి చెప్పడంతో బోరున విలపించారు.
News April 22, 2025
సివిల్ సర్వీసులో మెరిసిన చిక్కోల్ యువకుడు

కోటబొమ్మాలి మండలం చలమయ్యపేటకు చెందిన లింగుడు జోష్ సివిల్ సర్వీస్ పరీక్షల్లో సత్తా చాటారు. మంగళవారం విడుదలైన సివిల్ సర్వీస్ ఫలితాల్లో 790 ర్యాంక్ సాధించాడు. ఇతని తండ్రి బాలయ్య మాజీ సైనిక ఉద్యోగి, తల్లి రాజ్యలక్ష్మి. దీంతో జోష్‌ను పలువురు అభినందించారు.
News April 22, 2025
జలుమూరు: నాడు IPS.. నేడు IAS

జలుమూరు మండలం అల్లాడపేటకు చెందిన బాన్న వెంకటేశ్ 2023 సర్వీసెస్ ఫలితాలలో 467 ర్యాంక్ సాధించి IPSకు ఎంపికై ప్రస్తుతం హైదరాబాద్‌లో శిక్షణ పొందుతున్నాడు. అయితే IAS కావాలనే సంకల్పంతో వెంకటేశ్ మళ్లీ సివిల్స్ పరీక్షలు రాశాడు. మంగళవారం విడుదలైన సర్వీసెస్ ఫలితాలలో 15వ ర్యాంక్‌తో ఐఏఎస్ సాధించాడు. దీంతో వెంకటేశ్ తల్లిదండ్రులు చందర్రావు, రోహిణి అనందం వ్యక్తం చేశారు. వెంకటేశ్‌ని పలువురు అభినందించారు.