News October 29, 2025

HYD: అలెర్ట్ మరికాసేపట్లో వర్షం

image

హైదరాబాద్‌లో రానున్న 1-2 గంటల్లో తేలికపాటి వర్షం (<5 MM) పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, ఈదురుగాలులు గంటకు 40 KM వరకు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. వాతావరణం మేఘావృతంగా ఉంటుందని పేర్కొంది. వర్షం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నగర వాసులు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని, జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

Similar News

News October 29, 2025

ఖైరతాబాద్: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి BRS ఫిర్యాదు

image

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సీ.సుదర్శన్ రెడ్డిని బుధవారం బీఆర్ఎస్ నేతలు కలిశారు. కాంగ్రెస్ నేతలపై ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా రేవంత్ రెడ్డి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, హామీలు గుమ్మరించి ఓట్లు దండుకునేందుకు చూస్తున్నారని పేర్కొన్నారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, గంగుల కమలాకర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కలిసి ECకి ఫిర్యాదు చేశారు.

News October 29, 2025

ఐక్యత పాదయాత్రను విజయవంతం చేయండి: జిల్లా కలెక్టర్

image

సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవ వేడుకల నేపథ్యంలో ఐక్యత పాదయాత్ర (యూనిటీ మార్చ్) చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ హరిచందన అన్నారు. కలెక్టరేట్‌లో జిల్లాలోని ఐక్యత పాదయాత్ర నిర్వహణ సందర్భంగా సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సమన్వయ సహకారంతో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పటేల్ జయంతి ఉత్సవాల వేడుకలను చేపట్టనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.

News October 29, 2025

జూబ్లీహిల్స్ అభివృద్ధికి బీజేపీనే ప్రత్యామ్నాయం: కిషన్ రెడ్డి

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం జోరందుకుంది. బుధవారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌కి మద్దతుగా షేక్‌పేట్ డివిజన్‌లో కీలక సమావేశం నిర్వహించారు. స్థానిక అపార్ట్‌మెంట్ వాసులతో కలిసి ఆయన విస్తృత ప్రచారం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల వైఫల్యాలపై మండిపడ్డారు. ఈ రెండు పార్టీలు నియోజకవర్గ అభివృద్ధిని పూర్తిగా పట్టించుకోకుండా ప్రజలను మోసం చేశాయని ఓటర్లకు వివరించారు.