News April 10, 2024
సిద్దిపేటలో ఉద్యోగుల సస్పెన్షన్.. పెనుభారం !

మెదక్ MP అభ్యర్థి వెంకట్రామారెడ్డి నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న సెర్ప్, ఈజీఎస్ ఉద్యోగులను సిద్దిపేట కలెక్టర్ సస్పెండ్ చేశారు. అయితే జిల్లాలో ప్రస్తుత వేసవి సీజన్‌లో డీఆర్డీఏపై పెనుభారం పడనుంది. సెర్ప్ ఉద్యోగులు ధాన్యం కొనుగోళ్లలో కీలకంగా ఉండగా, ఈజీఎస్ ఉద్యోగులు ప్రస్తుత వేసవిలో ఉపాధి హామీ పనుల్లో కీలకంగా పనిచేయనున్నారు. ఈ సస్పెన్షన్‌తో కొనుగోళ్లు, ఉపాధి హామీ పనుల్లో ఇబ్బందులు ఎదురుకానున్నాయి.
Similar News
News January 12, 2026
జాతీయస్థాయికి 11 మంది మెదక్ క్రీడాకారులు

జాతీయస్థాయి రగ్బీ పోటీలకు మెదక్ జిల్లా నుంచి 11 మంది క్రీడాకారులు ఎంపికైనట్లు కోచ్ కర్ణం గణేశ్ రవికుమార్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా బోయిన్పల్లిలో జరిగిన రాష్ట్రస్థాయి అండర్-15, పోటీలలో 13 జిల్లాలకు చెందిన బాల, బాలికలు పాల్గొన్నారు. మెదక్ జిల్లా బాలికల టీం రెండో స్థానం కైవసం చేస్తుందని తెలిపారు. ఈనెల 15 నుంచి 17వ తేదీ వరకు జరిగే జాతీయస్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారని పేర్కొన్నారు.
News January 12, 2026
MDK: పోలీసుల అప్రమత్తతతో తప్పిన విషాద ఘటన

ఏడుపాయల వనదుర్గామాత ఆలయం సమీపంలోని ఘనపూర్ ఆనకట్ట వద్ద కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్యకు ప్రయత్నించిన కామారెడ్డి జిల్లాకు చెందిన బసవయ్యను QRT-1 టీమ్ ప్రాణాలకు తెగించి కాపాడింది. అక్కడ విధులు నిర్వహిస్తున్న QRT-1 సిబ్బంది ఏఆర్ ఎస్‌ఐలు శ్రీనివాస్, సాయిలు తదితరులు నది ప్రవాహంలోకి వెళ్లి తాడు సహాయంతో చాకచక్యంగా వ్యవహరించి అతడిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. వారి ధైర్యసాహసాలను స్థానికులు ప్రశంసించారు.
News January 12, 2026
మెదక్: పేకాట, కోడిపందాలపై కఠిన చర్యలు: ఎస్పీ

మెదక్ జిల్లా పరిధిలో పేకాట, కోడిపందాలు వంటి అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ శ్రీనివాస రావు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, పోలీస్ స్టేషన్‌ల పరిధిలో వాహన తనిఖీలు, రాత్రి, పగలు గస్తీ ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


