News October 29, 2025
‘మొంథా’ విజృంభిస్తోంది.. సెలవులు ఇవ్వండి!

మొంథా తుఫాను ప్రభావంతో వర్షాలు పడుతున్నాయి. కర్నూలు, నంద్యాలతో పాటు పలు జిల్లాల్లో నిన్నటి నుంచే పాఠశాలలకు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలోనూ సెలవు ప్రకటించాలనే డిమాండ్ వినిపిస్తోంది. భారీ వర్షాల ముప్పు ఉండటంతో విద్యార్థుల భద్రత దృష్ట్యా తుఫాన్ తీవ్రత తగ్గే వరకూ సెలవులు ప్రకటించాలని తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి.
Similar News
News October 29, 2025
ఇనుగుర్తిలో 20 సెం.మీ. అత్యధిక వర్షపాతం

MHBD జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సాయంత్రం 7గంటల వరకు నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. ఇనుగుర్తి మండలంలో 20 మీటర్ల అత్యధిక వర్షపాతం నమోదయ్యింది. గూడూరు 157.5, డోర్నకల్ 151.5, తొర్రూర్ 151.3, గార్ల 145 నమోదయింది. అమనగల్ 130.3, నెల్లికుదురు 120, కేసముద్రం 114.8, కురవిలోని అయ్యగారి పల్లిలో 113.8, మరిపెడ 110, గంగారంలో అత్యల్పంగా 42.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
News October 29, 2025
సిద్దిపేట జిల్లాలో 212.8 మీ.మీ వర్షపాతం

మొంథా తుపాను కారణంగా సిద్దిపేట జిల్లాలో 212.8 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అత్యధికంగా హుస్నాబాద్ 212.8 మి.మీ, అక్కన్నపేట 207.0 మి.మీ రికార్డు అయింది. హుస్నాబాద్, అక్కన్నపేట మండలాల్లో రెడ్ అలర్ట్ మోగింది. అత్యల్పంగా దౌల్తాబాద్ 15.8మీ.మీ, అక్బర్పేట భూంపల్లి మండలాల్లో 18, నంగునూర్ మండలంలో 13.88 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
News October 29, 2025
దుడ్డుఖళ్ళు పీహెచ్సీ, ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసిన DMHO

గుమ్మలక్ష్మీపురం మండలం దుడ్డుఖళ్ళు పీహెచ్సీ, ఆశ్రమ పాఠశాలను DMHO భాస్కరరావు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రికార్డులను సిబ్బంది సమయపాలన పరిశీలించారు. వార్డులో చికిత్స పొందుతున్న వారి వద్దకు వెళ్లి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం ఆశ్రమ పాఠశాలకు వెళ్లి డార్మెంటరీను తనిఖీ చేసి విద్యార్థులకు పెడుతున్న పౌష్టికాహారాన్ని పరిశీలించారు. ఆయన వెంట RBSK జగన్ మోహన్ రావు ఉన్నారు.


