News October 29, 2025
HYD: తెలుగు వర్సిటీ.. నేడు సాహితీ పురస్కారాల ప్రదానం

బాచుపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు వర్సిటీలో 2023 సంవత్సరానికి గాను సాహితీ పురస్కారాలకు 11 మంది ఎంపికైనట్లు వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హనుమంతరావు తెలిపారు. ఈనెల 29న నాంపల్లి ప్రాంగణంలో ఈ పురస్కారాలు ప్రదానం చేస్తామని, పురస్కారాల గ్రహీతలకు ఒక్కొక్కరికి రూ.20,116 నగదు అందజేసి సత్కరిస్తామన్నారు. 2020, 2021, 2022 సంవత్సరాల్లో వెలువడ్డ పుస్తకాలను సేకరించి పురస్కారాల ఎంపిక చేశామన్నారు.
Similar News
News October 30, 2025
తిరుపతి: ఆర్టీసీ ఉద్యోగుల నూతన కమిటీ నియామకం

ఆర్టీసీ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘ రీజినల్ నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర జనరల్ సెక్రెటరీ కేఈ శాస్త్రి వెల్లడించారు. తిరుపతి యూత్ హాస్టల్లో బుధవారం సంఘం అత్యవసర సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అధ్యక్షుడిగా సురేష్ నాయక్, కార్యదర్శిగా శ్రీనివాసులు, కోశాధికారిగా వెంకటేశ్వర్లు, ఉమ్మడి జిల్లాల గౌరవ అధ్యక్షుడిగా మైఖేల్, ముఖ్య సలహాదారుగా ద్వారకా నియమితులయ్యారు.
News October 29, 2025
భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

✓ జిల్లాలో ‘మొంథా’ అతలాకుతలం
✓ పాల్వంచ: జంట హత్య కేసు నిందితుడికి ఏడేళ్ల జైలు
✓ భద్రాచలం: నకిలీ డెత్ సర్టిఫికెట్‌తో డబ్బులు కాజేసిన ముఠా అరెస్ట్
✓ భద్రాద్రి: లొంగిపోయిన మావోయిస్టులకు SP రివార్డ్
✓ మెడికల్ కాలేజీలో సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
✓ భద్రాచలం: బోల్తా పడిన వాహనం.. డ్రైవర్‌కు గాయాలు
✓ గండుగులపల్లిలో రేపు క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్
✓ మణుగూరు: కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
News October 29, 2025
ఓపెన్ SSC, INTERలో చేరేందుకు దరఖాస్తులు చేసుకోవాలి

గద్వాల జిల్లాలో ఉన్న విద్యార్థులు ఓపెన్ SSC, INTERలో చేరేందుకు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా ఓపెన్ స్కూల్ (TOSS) కో-ఆర్డినేటర్ సునీతమ్మ బుధవారం తెలిపారు. ఈనెల 31లోగా (ఫైన్‌తో) www.telanganaopenschool.org దరఖాస్తులు చేసుకోవాలన్నారు. చదువు మానేసిన జోగులాంబ గద్వాల జిల్లా విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.


