News October 29, 2025
నల్గొండ: గౌడన్నా జర భద్రం!

నల్గొండ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గీత కార్మికులు తాటి చెట్లు ఎక్కేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు, గౌడ సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు. తడిసిన చెట్ల కాండాలు జారే ప్రమాదం ఉందని, ఇది ప్రాణాలకే ముప్పు తెస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షం కారణంగా చెట్టుపై పట్టు దొరకకపోవచ్చని, తుఫాను తగ్గేంత వరకు గీత వృత్తికి విరామం ఇవ్వాలని కోరుతున్నారు.
Similar News
News October 29, 2025
దేవరకొండ బడిలోకి చేరిన వరద.. మంత్రి కోమటిరెడ్డి ఆరా

దేవరకొండ(M) కొమ్మేపల్లి ట్రైబల్ వెల్ఫేర్ బాయ్స్ రెసిడెన్షియల్ పాఠశాలలోకి వర్షపు నీరు చేరిన ఘటనపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరా తీశారు. కొమ్మేపల్లి ST వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలకు ప్రహరీ లేకపోవడం, లోతట్టు ప్రాంతంలో ఉండడం వంటి కారణాల వల్ల హాస్టల్లోకి నీరు ప్రవేశించిందని కలెక్టర్ ఇలా త్రిపాఠి మంత్రికి వివరించారు. ఈ సమస్యను త్వరలోనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
News October 29, 2025
విషాదం: 10 రోజులకే వీడిన బంధం.. నవవధువు మృతి

NLG: గుర్రంపోడు(M)లో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ నవవధువు మృతి చెందగా, ఆమె భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. చామలేడుకు చెందిన సిలువేరు నవీన్, 10 రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న తన భార్యతో కలిసి బైక్‌పై గుర్రంపోడుకు వెళుతున్నారు. వారు బ్రిడ్జిపై ప్రయాణిస్తుండగా, ఎదురుగా మలుపు తిప్పుతున్న మరో బైక్‌ను చూసి నవీన్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో దంపతులిద్దరూ బైక్‌పై నుంచి ఎగిరి పడగా ఈ దుర్ఘటన జరిగింది.
News October 29, 2025
అక్రమ దత్తత.. ఏడుగురు అరెస్ట్: నల్గొండ ఎస్పీ

2 వేర్వేరు కేసులలో 10 రోజుల ఆడ శిశువును, 21 రోజుల మగ శిశువును అక్రమ దత్తత చేసిన ఏడుగురు వ్యక్తులను జిల్లా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ బుధవారం వెల్లడించారు. ఆడపిల్ల పుట్టిందని భారంగా భావించి ఒకరు, డబ్బుల కోసం మరొకరు కన్నపేగు బంధం మరిచి పిల్లలను అమ్ముకోగా.. జిల్లా పోలీసులు ఇద్దరు చిన్నారులను రక్షించి శిశు గృహకు తరలించారు.


