News October 29, 2025

GNT: 39 మంది గర్భిణులను జీజీహెచ్‌కు తరలింపు

image

‘మొంథా’ తుపాను తీవ్ర ప్రభావం నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కీలక చర్యలు చేపట్టారు. సోమవారం, మంగళవారం రోజుల్లో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 39 మంది గర్భిణులను సురక్షితంగా GNT GGHకు తరలించారు. తరలించిన గర్భిణులలో అచ్చంపేట, కారంపూడి, పెదకూరపాడు, దుగ్గిరాల ప్రాంతాలకు చెందిన మహిళలు ఉన్నారు. 24 గంటల విద్యుత్‌కు అంతరాయం కలగకుండా, 8 జనరేటర్లకు సరిపడా ఇంధనాన్ని సిద్ధం చేశారు.

Similar News

News October 30, 2025

ఖమ్మం: అంగన్వాడీల్లో కరువైన పర్యవేక్షణ..!

image

జిల్లాలో గర్భిణీలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించేందుకు ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ అధికారుల పర్యవేక్షణ లోపంతో అస్తవ్యస్తంగా మారింది. జిల్లాలోని పలు కేంద్రాల్లో చిన్నారులకు మధ్యాహ్న భోజనాన్ని సైతం పెట్టడం లేదంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలని పలువురు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు కేంద్రాలపై దృష్టి సారించి, మెరుగైన సేవలు అందేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

News October 30, 2025

ఏసీబీకి పట్టుబడ్డ యాదగిరిగుట్ట ఏఈఈ రామారావు

image

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో పనిచేస్తున్న అధికారి ఉప్పల్‌లో ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టు పడ్డాడు. ఓ కాంట్రాక్టర్ వద్ద నుంచి రూ.1,90,000 తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. ఆలయంలో ఎలక్ట్రిసిటీ విభాగంలో పనిచేస్తున్న రామారావుకు సంబంధించిన బంధువుల ఇండ్లలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి.

News October 30, 2025

నాగర్‌కర్నూల్: నూతన RTO భవనానికి 2 ఎకరాల స్థలం కేటాయింపు

image

స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి నిరంతర కృషి ఫలితంగా నాగర్‌కర్నూల్‌కు కొత్త ఆర్టీఓ (RTO) కార్యాలయం మంజూరైంది. ఎస్పీ ఆఫీస్ సమీపంలో ఆర్టీఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అధికారికంగా జీవోను విడుదల చేసింది. ఈ కార్యాలయ నిర్మాణానికి 2 ఎకరాల స్థలం కేటాయించగా, సీఎస్‌ఆర్ నిధులతో రూ.50 లక్షలతో నూతన భవనం నిర్మించనున్నారు.