News October 29, 2025
ఖమ్మం, కొత్తగూడెం కలెక్టర్లకు తుమ్మల ఫోన్

మొంథా తుపాను తీరం దాటిన నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షించారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లతో ఫోన్‌లో మాట్లాడిన మంత్రి, అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు గ్రామాల ప్రజలను ముందస్తుగా హెచ్చరించాలని, కీలక ఆదేశాలు జారీ చేశారు.
Similar News
News October 30, 2025
ఖమ్మం: అంగన్వాడీల్లో కరువైన పర్యవేక్షణ..!

జిల్లాలో గర్భిణీలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించేందుకు ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ అధికారుల పర్యవేక్షణ లోపంతో అస్తవ్యస్తంగా మారింది. జిల్లాలోని పలు కేంద్రాల్లో చిన్నారులకు మధ్యాహ్న భోజనాన్ని సైతం పెట్టడం లేదంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలని పలువురు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు కేంద్రాలపై దృష్టి సారించి, మెరుగైన సేవలు అందేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
News October 30, 2025
ఏసీబీకి పట్టుబడ్డ యాదగిరిగుట్ట ఏఈఈ రామారావు

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో పనిచేస్తున్న అధికారి ఉప్పల్‌లో ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టు పడ్డాడు. ఓ కాంట్రాక్టర్ వద్ద నుంచి రూ.1,90,000 తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. ఆలయంలో ఎలక్ట్రిసిటీ విభాగంలో పనిచేస్తున్న రామారావుకు సంబంధించిన బంధువుల ఇండ్లలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి.
News October 30, 2025
నాగర్‌కర్నూల్: నూతన RTO భవనానికి 2 ఎకరాల స్థలం కేటాయింపు

స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి నిరంతర కృషి ఫలితంగా నాగర్‌కర్నూల్‌కు కొత్త ఆర్టీఓ (RTO) కార్యాలయం మంజూరైంది. ఎస్పీ ఆఫీస్ సమీపంలో ఆర్టీఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అధికారికంగా జీవోను విడుదల చేసింది. ఈ కార్యాలయ నిర్మాణానికి 2 ఎకరాల స్థలం కేటాయించగా, సీఎస్‌ఆర్ నిధులతో రూ.50 లక్షలతో నూతన భవనం నిర్మించనున్నారు.


