News October 29, 2025
WGL: సైబర్ నేరగాళ్ల కొత్త మోసం

సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ సైబర్ నేరగాళ్లు కొత్త రకాల మోసాలకు తెరలేపుతున్నారు. ఇటీవల వారు పోలీస్ లేదా సీబీఐ అధికారులుగా పరిచయం చేసుకుంటూ ప్రజలను భయపెట్టి డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు వరంగల్ పోలీసులు హెచ్చరించారు. ఫోన్ కాల్స్ వస్తే భయపడకుండా, ఎటువంటి వ్యక్తిగత వివరాలు వెల్లడించకుండా తక్షణమే సమీప పోలీస్ స్టేషన్ లేదా సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని అన్నారు.
Similar News
News October 29, 2025
ఓడలరేవు తుఫాను బాధితులకు సీఎం భరోసా

కోనసీమ జిల్లాలోని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం పర్యటించారు. అల్లవరం మండలం ఓడలరేవు పునరావాస కేంద్రాలలో ఉన్న బాధితులతో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం నుంచి అందిన సహాయంపై అడిగి తెలుసుకున్నారు. బాధితులు అధైర్య పడవద్దని, ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు వారికి భరోసా ఇచ్చారు.
News October 29, 2025
కరీంనగర్: పత్తి రైతులకు శుభవార్త..!

కరీంనగర్ జిల్లాలోని పత్తి రైతులకు 6 జిన్నింగ్ మిల్లులో సీసీఐ పత్తి కొనుగోళ్లు ప్రారంభించిందని జిల్లా మార్కెటింగ్ అధికారి యం.డి షాహబోద్ధిన్ తెలిపారు. 1. శక్తి మురుగన్ ఇండస్ట్రీ, జమ్మికుంట ఎలబోతారం, 2. వైభవ్ కాటన్ కార్పోరేషన్ 3. నరసింహ కాటన్ జిన్మింగ్ 4.సరిత కాటన్ ఇండస్ట్రీస్ 5. సీతారామ కాటన్ ఇండస్ట్రీ 6. కావేరి జిన్నింగ్ మిల్లు, వెలిచాల. రైతులు కాపాస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలన్నారు.
News October 29, 2025
‘మొంథా’ ఎఫెక్ట్.. అధికారులను అప్రమత్తం చేసిన సీఎం

TG: ‘మొంథా’ తుఫాను ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. వరికోతల సమయం కావడంతో ఆరబోసిన ధాన్యానికి నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. చెరువులు, రిజర్వాయర్ల నీటిమట్టాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించాలని తెలిపారు. రోడ్లపై నీరు నిలిచిన ప్రాంతాల్లో, లోలెవల్ బ్రిడ్జిలపై నుంచి రాకపోకలు నిషేధించాలని ఆదేశించారు. హైడ్రా, ఇతర రెస్క్యూ సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు.


