News October 29, 2025

వనపర్తి: భారీ వర్షాలు… ఇంటర్ కళాశాలలకు సెలవు

image

భారీ వర్షాల కారణంగా వనపర్తి జిల్లాలోని అన్ని ఇంటర్ కళాశాలలకు బుధవారం సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి ఎర్ర అంజయ్య తెలిపారు. కళాశాలలకు వెళ్లడానికి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నందున ముందస్తుగా ఈ సెలవు ప్రకటించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు అన్ని కళాశాలల ప్రిన్సిపల్‌లకు సమాచారం ఇచ్చారు. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని ఆయన సూచించారు.

Similar News

News October 30, 2025

కందిలో పచ్చదోమ – నివారణకు సూచనలు

image

వాతావరణంలో తేమ శాతం ఎక్కువ ఉన్నపుడు కందిలో పచ్చదోమ ఉద్ధృతి పెరుగుతుంది. పచ్చదోమ పురుగులు కంది ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీలుస్తాయి. దీంతో ఆకులు పసుపుపచ్చగా మారి ముడుచుకొని దోనె లాగా కనిపిస్తాయి. తీవ్రత పెరిగితే ఆకులు ఎర్రబడి రాలిపోయి.. మొక్కల ఎదుగుదల, దిగుబడి తగ్గుతుంది. పచ్చదోమ నివారణకు లీటరు నీటికి మోనోక్రోటోఫాస్‌ 36% S.L 1.6ml లేదా డైమిథోయేట్‌ 30%E.C 2.2ml కలిపి పిచికారీ చేయాలి.

News October 30, 2025

NLG: యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి: మంత్రి

image

భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని.. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదేశించారు. పోలీస్, రెవెన్యూ, విద్యుత్, ఇరిగేషన్, R&B, పంచాయతీ రాజ్, వైద్య ఆరోగ్య శాఖల సమన్వయంతో పనిచేయాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్, ఎస్పీని మంత్రి ఆదేశించారు.

News October 30, 2025

మహిళ సూసైడ్ అటెంప్ట్

image

గుత్తి మండలం అబ్బేదొడ్డినికి చెందిన శిరీష పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించి, 48 గంటల పాటు అబ్జర్వేషన్‌లో ఉండాలని శిరీషకు సూచించారు.