News October 29, 2025

MHBD: ‘అత్యవసరమైతే కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలి’

image

మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీవర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్‌ను (7995074803) ఏర్పాటుచేసినట్లు కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా ఎక్కడ ఎలాంటి అత్యవసరమైన పరిస్థితి ఏర్పడినా ఈ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. కంట్రోల్ రూమ్ నందు సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని, ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.

Similar News

News October 30, 2025

కామారెడ్డి: ఆయిల్ ఫాం సాగుపై రైతులకు అవగాహన కల్పించాలి: కలెక్టర్

image

ఆయిల్ ఫాం సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. బుధవారం కామారెడ్డి జిల్లాలోని కలెక్టరేట్‌లో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ, ప్రతి ప్రాథమిక వ్యవసాయ సంఘానికి 100 ఎకరాల ఆయిల్ పామ్ సాగు లక్ష్యం నిర్ణయించామన్నారు. ఇది రైతులకు దీర్ఘకాలిక ఆదాయ వనరుగా మారుతుందని తెలిపారు.

News October 30, 2025

ASF: వైద్య కళాశాలలో దరఖాస్తులకు ఆహ్వానం

image

ఆసిఫాబాద్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో గల ఖాళీల కోసం ఆన్ లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపల్ పత్రిక తెలిపారు. 2025-2026 విద్యా సంవత్సరానికి గాను DMLT-30 & DECG – 30 సీట్లు ఉన్నాయన్నారు. అర్హత గల అభ్యర్థులు www.tgpmb.telangana.gov.in వెబ్సైట్‌లో అప్లై చేసుకోవాలన్నారు. దరఖాస్తు గడువును ఈ నెల 28 నుంచి నవంబర్ 27 వరకు పొడిగించినట్లు వెల్లడించారు.

News October 30, 2025

నిర్మల్: నవంబర్ 4న జిల్లా స్థాయి యువజన ఉత్సవాలు

image

నవంబర్ 4 నుంచి జిల్లా స్థాయి యువజన ఉత్సవాలు నిర్వహించనున్నారు. జానపద నృత్యం, పాటలు(బృందం) కవిత్వం, వ్యాసరచన, ఉపన్యాసం (హిందీ,ఇంగ్లీష్,తెలుగు) పెయింటింగ్, ఇన్నోవేషన్ ట్రాక్, తదితర అంశాలలో పోటీలు నిర్వహించనున్నారు. నవంబర్ 4న 15 నుంచి 29 సంవత్సరాల వయస్సు గల వారు తెలంగాణ సాంఘిక సంక్షేమ పాఠశాల సోఫీ నగర్‌లో హాజరు కావాలని సూచించారు. ప్రథమ స్థానంలో నిలిచినవారిని రాష్ట్రస్థాయికి పంపనున్నారు.