News October 29, 2025

LMD గేట్లను ఎత్తనున్న అధికారులు..!

image

కరీంనగర్ జిల్లా లోయరు మానేరు జలాశయం ఎల్ఎండీ గేట్లను ఎత్తనున్నట్లు అధికారులు తెలిపారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు రెండు గేట్లను ఎత్తి 4000 క్యూసెక్కుల నీటిని మానేరు వాగులోకి వదలనున్నట్లు చెప్పారు. మానేరు వాగు పరిసర ప్రాంతాల రైతులు, మత్స్యకారులు, పశువుల కాపరులు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Similar News

News October 30, 2025

‘మహాకాళి’గా భూమికా శెట్టి

image

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో రానున్న మహాకాళి సినిమా ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో మహాకాళిగా కన్నడ భామ భూమికా శెట్టి నటించనున్నారు. భూమికా శెట్టిని ‘మహా’గా పరిచయం చేస్తున్నామని పేర్కొన్నారు. ఈమె తెలుగులో ‘షరతులు వర్తిస్తాయి’ అనే చిత్రంలో హీరోయిన్‌గా నటించారు. PVCUలో తొలి లేడీ సూపర్ హీరోగా ఈమె కనిపించనున్నారు. ఈ మూవీకి పూజా అపర్ణ దర్శకత్వం వహించనున్నారు.

News October 30, 2025

చరిత్రలో భారీ లేఆఫ్స్ ఇవే..

image

కరోనా తర్వాత అగ్రశ్రేణి కంపెనీల్లోనూ లేఆఫ్స్ పెరుగుతున్నాయి. తాజాగా ప్రపంచవ్యాప్తంగా 14వేల మందిని తొలగించిన అమెజాన్.. మరో 16వేల మందిపై వేటుకు సిద్ధమవుతోంది. అయితే కరోనా కంటే ముందు కూడా కొన్ని సంస్థలు నష్టాల వల్ల భారీ లేఆఫ్స్ ఇచ్చాయి. 1993లో IBM 60వేల జాబ్స్, సిటీ గ్రూప్ 2008-09లో 75K, 2009లో జనరల్ మోటార్స్ 47K, 2012-15లో హ్యూలెట్-ప్యాకర్డ్ 55K ఉద్యోగాలకు కోత పెట్టాయి.

News October 30, 2025

వరద బాధితులను పరామర్శించిన మంత్రి కొండా

image

మొంథా తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరంగల్ జిల్లాలో అనేక ప్రాంతాలు వరద ముంపునకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ గురువారం ఎన్‌.ఎన్‌. నగర్‌లోని వరద బాధితులను పరామర్శించారు. అవసరమైన సహాయం అందేలా తక్షణ చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. ముంపు ప్రాంతాల్లో ఎవరూ ఇబ్బందులు పడకూడదని, ఆహారం, తాగునీరు, వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.