News April 10, 2024
VZM: భద్రాచలానికి ప్రత్యేక బస్సు.. టైమింగ్స్ ఇవే

శ్రీరామనవమి సందర్భంగా విజయనగరం నుంచి భద్రాచలం వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక బస్సు ఏర్పాటు చేస్తున్నట్లు డిపో ప్రబంధకుడు శ్రీనివాసరావు తెలిపారు. ఈనెల 16న సాయంత్రం 4.30 గంటలకు విజయనగరం డిపో నుంచి బస్సు బయల్దేరి, ఆదివారం ఉదయం 5 గంటలకు అక్కడికి చేరుకుంటుందన్నారు. అదేరోజు సాయంత్రం 5 గంటలకు తిరిగి బయల్దేరి సోమవారం ఉదయం 5.30 గంటలకు ఇక్కడకు వస్తుందని చెప్పారు.
Similar News
News July 9, 2025
VZM: అగ్నిప్రమాదం.. ఇళ్లబాట పట్టిన విద్యార్థినులు

కొత్తవలస మండలం తుమ్మికాపల్లి KGBVలో మంగళవారం రాత్రి జరిగిన <<16996993>>అగ్ని ప్రమాదం<<>>తో ఆందోళన చెందిన విద్యార్థినిలు ఇళ్ల బాట పట్టారు. 20 రోజుల క్రితం ఇదే పాఠశాలలో అగ్ని ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. వరుస ప్రమాదాల నేపథ్యంలో విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళన చెంది ఇళ్లకు తీసుకెళ్లారు. గతంలో జరిగిన ప్రమాదంపై స్పందించిన మంత్రి లోకేశ్.. ఈసారి ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.
News July 9, 2025
VZM: ‘ఆ వాహనాలను త్వరితగతిన గుర్తించాలి’

హిట్ అండ్ రన్ కేసుల్లో నేరానికి పాల్పడిన వాహనాలను త్వరితగతిని గుర్తించాలని SP వకుల్ జిందాల్ ఆదేశించారు. మంగళవారం ఆయన కార్యాలయంలో పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ కేసుల్లో బాధితులకు పరిహారం చెల్లించేందకు సాక్ష్యాలను సేకరించి RDOకు పంపాలన్నారు. అలాగే వివిధ పోలీస్ స్టేషన్‌లో దర్యాప్తులో ఉన్న 194BNSS (గుర్తు తెలియని మృతదేహాల) కేసులను సమీక్షించారు. కేసుల దర్యాప్తు అంశాలను పొందుపరచాలన్నారు.
News July 8, 2025
VZM: ‘బంగారు కుటుంబాల దత్తత ప్రక్రియ పూర్తి చేయండి’

P4 కార్యక్రమంలో భాగంగా వెంటనే మార్గదర్శులను గుర్తించే ప్రక్రియను మొదలుపెట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. జిల్లా అధికారులు, ఆర్‌డివోలు, నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్లతో సోమవారం కలెక్టర్ తమ ఛాంబర్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 67,066 బంగారు కుటుంబాలను గుర్తించామని, వారి దత్తత ప్రక్రియ ఈ నెలాఖరుకు పూర్తి చేయాలన్నారు.