News October 29, 2025

GNT: డెల్టా రైలు ప్రమాదం.. మర్చిపోలేని విషాదం

image

2005 అక్టోబర్‌ 29న వలిగొండ వద్ద జరిగిన డెల్టా రైలు ప్రమాదం గుంటూరు జిల్లా ప్రజలకు మర్చిపోలేని పీడకల. రేపల్లె-సికింద్రాబాద్ మధ్య నడిచే ఈ రైలుకు జిల్లా ప్రజలతో సన్నిహిత అనుబంధం ఉంది. వలిగొండ-రామన్నపేట మధ్య ఉన్న వంతెన వరదలో కొట్టుకుపోవడంతో, రైలు ఇంజిన్‌తో సహా 7 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘోర దుర్ఘటనలో నిద్రిస్తున్న ప్రయాణికులలో దాదాపు 116 మంది ప్రాణాలు కోల్పోగా, అనేక మంది గాయపడ్డారు.

Similar News

News October 30, 2025

VZM: ఉద్యోగులకు క్రీడా ఎంపిక పోటీలు వాయిదా

image

ప్రభుత్వ సివిల్ సర్వీస్ ఉద్యోగులకు జరగాల్సిన క్రీడా ఎంపిక పోటీలను మొంథా తుఫాన్ కారణంగా నిరవధికంగా వాయిదా వేశామని జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి ఎస్. వెంకటేశ్వరరావు గురువారం తెలిపారు. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు వాయిదా వేశామని, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి పోటీల తదుపరి తేదీలు వివరాలను త్వరలో ప్రకటిస్తామన్నారు. ఉద్యోగులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

News October 30, 2025

CBSE పరీక్షల తేదీలు విడుదల

image

వచ్చే ఏడాది జరిగే టెన్త్, 12వ తరగతి పరీక్షల ఫైనల్ డేట్ షీట్‌ను CBSE విడుదల చేసింది. రెండు క్లాసులకూ ఫిబ్రవరి 17 నుంచి పరీక్షలు మొదలవుతాయి. టెన్త్ విద్యార్థులకు మార్చి 10వ తేదీ వరకు, 12వ క్లాస్ స్టూడెంట్లకు ఏప్రిల్ 9 వరకు జరుగుతాయి. రోజూ ఉదయం 10.30 గంటలకు ఎగ్జామ్స్ ప్రారంభమవుతాయి. పరీక్షల షెడ్యూల్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News October 30, 2025

కార్తీక దీపాలంకరణలో ధర్వేశిపురం ఎల్లమ్మ దర్శనం

image

కనగల్ మండలంలోని ధర్వేశిపురంలో వెలసిన స్వయంభు శ్రీ ఎల్లమ్మ అమ్మవారు కార్తీక గురువారం సాయంత్రం సందర్భంగా భక్తులకు దివ్యదర్శనం ఇచ్చారు. ఆలయంలో చేసిన దీపాలంకరణతో భక్తి వాతావరణం అలముకుంది. ఆలయ అర్చకుడు నాగోజు మల్లాచారి ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, పంచామృతాభిషేకాలు నిర్వహించారు. అమ్మవారి దర్శనం కోసం స్థానికులు, భక్తులు భారీగా తరలివచ్చారు.