News October 29, 2025
టాస్ ఓడిన టీమ్ ఇండియా

ఇండియాతో జరుగుతున్న 5 టీ20ల సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ బౌలింగ్ ఎంచుకుంది.
IND ప్లేయింగ్ XI: అభిషేక్ శర్మ, గిల్, సూర్యకుమార్(C), తిలక్ వర్మ, సంజూ శాంసన్, దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా
AUS ప్లేయింగ్ XI: మార్ష్(కెప్టెన్), హెడ్, జోష్ ఇంగ్లిస్, టిమ్ డేవిడ్, ఓవెన్, స్టోయినిస్, ఫిలిప్, బార్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్, కుహ్నెమాన్, హేజిల్‌వుడ్
Similar News
News October 30, 2025
నేడే కీలక పోరు.. భారత్ గెలిచేనా?

ఉమెన్స్ వరల్డ్ కప్‌లో ఇవాళ భారత్, ఆస్ట్రేలియా మధ్య మ.3 గంటల నుంచి సెమీ ఫైనల్-2 జరగనుంది. బలమైన AUSను ఎలాగైనా ఓడించాలని IND భావిస్తోంది. షఫాలీ వర్మ రాకతో టాపార్డర్ స్ట్రాంగ్‌గా మారనుంది. ఈ మ్యాచులో గెలిచిన జట్టు నవంబర్ 2న సౌతాఫ్రికాతో ఫైనల్‌లో తలపడనుంది. ODI WCలలో ఇప్పటివరకు IND, AUS 14 మ్యాచుల్లో తలపడగా IND మూడింట్లో మాత్రమే గెలిచింది. స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో లైవ్ చూడవచ్చు.
News October 30, 2025
యూట్యూబ్ వీడియోలు ఇకపై మరింత స్పష్టంగా!

యూట్యూబ్ తన ప్లాట్‌ఫామ్‌లోని LOW రిజల్యూషన్ వీడియోల విజ్యువల్ క్లారిటీని AI సాయంతో మెరుగుపరచనుంది. ఇందుకోసం ‘అప్‌స్కేలింగ్’ అనే ఫీచర్‌ను తీసుకురానుంది. 1080P కంటే తక్కువ రిజల్యూషన్‌లో అప్‌లోడ్ అయిన వీడియోలను దీని సాయంతో ఇంప్రూవ్ చేస్తారు. ఫ్యూచర్‌లో 4K క్వాలిటీ కంటే బెటర్‌గా కూడా చేయొచ్చని సంస్థ వర్గాలు పేర్కొన్నారు. దీని వల్ల TVలు, వెబ్, మొబైల్ డివైజ్‌లలో వీడియోలు మరింత స్పష్టంగా కనిపిస్తాయి.
News October 30, 2025
దక్షిణాఫ్రికా సిరీస్‌కు శ్రేయస్ దూరం?

టీమ్ ఇండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ మరో 2 నెలలపాటు కాంపిటీటివ్ క్రికెట్‌కు దూరమయ్యే అవకాశం ఉందని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. దీంతో నవంబర్, డిసెంబర్‌లో దక్షిణాఫ్రికాతో జరిగే 3 మ్యాచుల వన్డే సిరీస్‌కు ఆయన దూరం కానున్నట్లు తెలుస్తోంది. జనవరిలో న్యూజిలాండ్ జరిగే ODI సిరీస్ నాటికి ఫిట్‌నెస్ సాధించే ఛాన్స్ ఉంది. ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో క్యాచ్ అందుకుంటూ ఆయన గాయపడిన సంగతి తెలిసిందే.


