News April 10, 2024
అనంత: పెరిగిన టమాటా ధరలు.. రైతుల హర్షం వ్యక్తం

కూడేరు: పది రోజులుగా మార్కెట్‌లో టమాటా ధర పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం కిలో రూ.40 పలుకుతోంది. ఇన్ని రోజులూ కిలో రూ.10 లోపే ఉండేది. మండల వ్యాప్తంగా సుమారు 200 ఎకరాల విస్తీర్ణంలో రైతులు సాగు చేశారు. 15 కేజీల టమాట బాక్స్ ధర నాణ్యతను బట్టి రూ.300 నుంచి రూ.450 వరకు పలుకుతోంది. ధర పెరగడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News March 11, 2026
1,245 మంది బాలికలకు HPV వ్యాక్సిన్ వేషం

క్యాన్సర్ నివారణ కోసం జిల్లా వ్యాప్తంగా HPV వ్యాక్సినేషన్ కార్యక్రమం అన్ని PHC, పట్టణ, ప్రాంతీయ, కమ్యూనిటీ ఆసుపత్రులలో జరిగినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఇన్‌ఛార్జ్ అధికారి డా.శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. జిల్లాలో 1,649 మంది 14 ఏళ్ల బాలికలను గుర్తించామన్నారు. అందులో నేడు 1,245 మంది బాలికలకు వ్యాక్సిన్ వేశామన్నారు. వ్యాక్సిన్ అనంతరం వైద్యులు అమ్మాయిలకు ధ్రువపత్రాలు పంపిణీ చేశారన్నారు.
News March 11, 2026
పరీక్షలకు 269 మంది విద్యార్థుల గైర్హాజరు

అనంతపురం జిల్లాలో నేడు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు కామర్స్ పరీక్షలు జరిగాయి. నేటి పరీక్షలకు సెట్-III ప్రశ్న పత్రాన్ని వాడామని RIO వెంకటరమణ నాయక్ తెలిపారు. జనరల్ విద్యార్థులు 4,069 గాను 3,937 మంది హాజరు కాగా 132 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విద్యార్థులు 1,468 గాను 1,331 మంది హాజరు కాగా 137 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. పరీక్షలను CC కెమెరాల పర్యవేక్షణలో పకడ్బందీగా నిర్వహించామన్నారు.
News March 11, 2026
అనంత: ఫలితాలు విడుదల

అనంతపురం జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో ఫిబ్రవరి నెలలో నిర్వహించిన M.Tech 1-1 (R25) రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను వైస్ ప్రిన్సిపల్ దిలీప్ కుమార్‌తో కలిసి ప్రిన్సిపల్ పి.చెన్నారెడ్డి మంగళవారం విడుదల చేశారు. విద్యార్థులు తమ ఫలితాలను తెలుసుకునేందుకు కళాశాలలోని అకడమిక్ సెక్షన్‌ను సంప్రదించాలని సూచించారు.


